
● ‘గురి’ తప్పని మారెప్ప
పాల్వంచరూరల్: అశ్వారావుపేట మండలం గొప్పన్నగూడెం గ్రామానికి చెందిన మారెప్ప ప్రస్తుతం కాచనపల్లి బాలిక క్రీడాపాఠశాలలో ఆర్చరీ కోచ్‌గా పనిచేస్తున్నారు. గతంలో కిన్నెరసాని గిరిజన క్రీడా పాఠశాలలో పనిచేశారు. ఆర్చరీలో జాతీయ, అంతర్జాతీయస్థాయి పోటీల్లో ప్రతిభ చూపారు. 1989–90లో రష్యా, ఇటలీలో జరిగిన పోటీల్లో పాల్గొని ఇండియా టీమ్ బ్రాంజ్ మెడల్ సాధించడంలో కీలకపాత్ర పోషించారు. వ్యక్తిగత విభాగంలో సిల్వర్‌మెడల్ సాధించారు. మారెప్ప వద్ద శిక్షణ పొందిన విద్యార్థులు క్రీడా రంగాల్లో ఉన్నతస్థానాలకు చేరారు. కాచనపల్లి బాలికల క్రీడా పాఠశాలకు చెందిన అవంతిక, బి.సంజనశ్రీ, ఎం.గౌతమి, కె.అనందుజ, కె.లక్ష్మీసౌజన్య, కె.లవణ్య జాతీయ, రాష్ట్రస్థాయిలో ప్రతిభ చూపారు. కిన్నెరసాని విద్యార్థులు శివశంకర్ ఆర్మీలో, వెంకన్న రైల్వేలో స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు సాధించారు.
మారుమూల ప్రాంతాల్లో ఇప్పటికీ చాలామంది ప్రతిభ కలిగిన నిరుపేద గిరిజన విద్యార్థులు ఉన్నారు. వారికి చదువుతోపాటు ఆటల్లో కూడా శిక్షణ ఇస్తే రాణిస్తారు. గిరిజనులకు ఎంతో కొంత మేలు చేయాలనే ఉద్దేశంతో శిక్షణ ఇస్తున్నాను. ఐటీడీఏ పీఓ ఆర్చరీ క్రీడను ప్రోత్సహిస్తున్నారు. కాచనపల్లిలో బాలికలకు విలువిద్యలో తర్ఫీదు ఇస్తున్నాను.
–మారెప్ప, ఆర్చరీ కోచ్