
పాము కాటుతో రైతు మృతి
టేకులపల్లి: పాము కాటుతో రైతు మృతి చెందిన సంఘటన గురువారం జరిగింది. మండలంలోని రామచంద్రునిపేట పంచాయతీ మురుట్ల గ్రామానికి చెందిన వజ్జా లక్ష్మయ్య (40) చేలో పనిచేస్తుండగా పాము కాటువేసింది. దీంతో కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి కాలినడకన బయలుదేరాడు. ఎదురొచ్చిన కుటుంబీకులు అతడిని తొలుత గ్రామీణ వైద్యుడి ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ ఆయన లేకపోవడంతో సులానగర్ పీహెచ్‌సీకి తీసుకెళ్లారు. అక్కడా వైద్యులెవరూ లేకపోవడంతో కొత్తగూడెం ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.