
● పోటీ పరీక్షలకు సిద్ధం చేస్తూ..
టేకులపల్లి: విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణించేలా టేకులపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న భౌతిక శాస్త్ర ఉపాధ్యాయుడు ఎం.మోహన్‌రావు కృషి చేస్తున్నారు. ఉన్నతి, వృత్యంతర శిక్షణలో జిల్లా రిసోర్స్ పర్సన్‌గా పని చేసి కలెక్టర్ జితేష్ వి.పాటిల్ చేత ప్రశంసలు పొందారు. ఆయన పర్యవేక్షణలో పలువురు విద్యార్థులు రాష్ట్రస్థాయిలో బహుమతులు సాధించారు.
● 2019లో టేకులపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థిని రాజేశ్వరి తయారు చేసిన గాలి మరల ద్వారా విద్యుదుత్పత్తి ప్రాజెక్ట్ సైన్స్‌ఫేర్‌లో రాష్ట్రస్థాయికి ఎంపికై ంది. 2024లో సైన్స్‌ఫేర్‌లో నెల్లూరి గీత జిల్లాస్థాయిలో ప్రథమ బహమతి పొందింది.
● 2022లో చెకుముకి పోటీల్లో విద్యార్థులు గీత, శ్రీహరి, హర్షిత జట్టు జిల్లాస్థాయిలో ప్రథమ బహుమతి సాధించారు.
● 2024లో చెకుముకి పోటీలో దివ్యశ్రీ, శ్రీహరిణి పవార్, గీతలు జిల్లాలో ప్రథమ, రాష్ట్రస్థాయిలో నాలుగో బహుమతి సాధించారు.
● 2018–19లో విద్యార్థులు తేజావత్ రామరాజు, కోరండ్ల సాయికిరణ్, 2023–24లో తేజస్వి, మహేందర్, గీతాంజలి, గురుచరణ్‌లు ఎన్‌ఎంఎంఎస్ స్కాలర్‌షిప్‌నకు ఎంపికయ్యారు.
● 2019–20లో ఫోరం ఆఫ్ ఫిజికల్ సైన్స్ టీచర్స్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫిజికల్ సైన్స్ జిల్లా స్థాయి టాలెంట్ టెస్టులో విద్యార్థులు కార్తికేయని, పావని, చరణ్‌తేజ, గ్రీష్మలు జిల్లా ద్వితీయ బహుమతి, 2025లో నిర్వహించిన టాలెంట్ టెస్టులో నెల్లూరి గీత జిల్లా ప్రథమ బహుమతి పొందారు.