
● వినూత్నంగా బోధన..
కరకగూడెం: మండలంలోని భట్టుపల్లి జెడ్పీ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు తేజావత్ మోహన్ బాబు వినూత్నంగా బోధిస్తూ విద్యార్థుల ఉన్నతికి కృషి చేస్తున్నాడు. హెచ్‌ఎం కాకముందు సోషల్ బోధించిన ఆయన 2023లో రాష్ట్రస్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యారు. స్వచ్ఛ విద్యాలయం పురస్కారం కూడా వరించింది. వీటితోపాటు మరో 24 అవార్డులు వచ్చాయి.
చరిత్ర, సామాజిక శాస్త్రం సబ్జెక్ట్‌లను కథల రూపంలో బోధిస్తే విద్యార్థులకు సులువుగా అర్థమవుతుంది. పాఠం పూర్తయ్యాక ప్రశ్నలు తయారు చేయాలని విద్యార్థులను ప్రోత్సహించాను. విద్యార్థులతో ప్రాజెక్ట్ వర్క్ చేయించాను. స్మార్ట్ క్లాస్ రూమ్స్ వినియోగించి, వీడియోల ద్వారా శాసీ్త్రయ సూత్రాలను వివరించాను. పర్యావరణ పరిరక్షణకు విద్యార్థులతో చెట్లు నాటించాను బడిబాట కార్యక్రమాన్ని ఆదర్శంగా నిర్వహించి ఎక్కువ మంది పిల్లలు పాఠశాలలో చేరేలా చేశాను. తరగతి గది పుణ్యక్షేత్రం వంటిది. విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించేందుకు నావంతు కృషి చేస్తున్నాను.
–తేజావత్ మోహన్ బాబు,హెచ్‌ఎం