
● బోధనలో ప్రత్యేక శైలి..
పాల్వంచరూరల్ : రాష్ట్రస్థాయిలో ఉత్తమ అధ్యాపకుడిగా పాల్వంచ డిగ్రీ కళాశాల బోటనీ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ దేవసాని రమేష్ ఎంపికయ్యారు. ఆయన ప్రత్యేక శైలిలో బోధించడమే కాక పర్యావరణ ప్రేమికుడిగా గుర్తింపు పొందారు. 1993 జూన్ 14న కొత్తగూడెంలోని ప్రభుత్వ పాఠశాలో ఉపాధ్యాయుడిగా చేరిన రమేష్.. 2001 వరకు టీచర్‌గా, 2001 నుంచి 2013 వరకు జూనియర్ లెక్చరర్‌గా పని చేశారు. 2013 నుంచి ఇప్పటివరకు పాల్వంచ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బోటనీ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. పర్యావరణంపై విద్యార్థులకు అవగాహన కల్పించడం, మొక్కలు నాటి సంరక్షించడంతో పాటు కళాశాలలో అడ్మిషన్ల సంఖ్యను 350 నుంచి 500కు పెరిగేలా కృషి చేశారు. విద్యార్థులకు కాలేజీలో, జూమ్ ద్వారా ఆధునిక పద్ధతిలో బోధిస్తూ, ఉన్నత విద్య, ఉద్యోగాల కోసం వారికి ప్రత్యేక తర్ఫీదు ఇస్తున్నారు. వరిలో చీడపీడల నివారణకు పరిశోధన చేసి పుస్తకం రచించారు. ఇలాంటి సేవలు ఆయనను రాష్ట్రస్థాయి అవార్డుకు ఎంపిక చేశాయి. కాగా, రమేష్‌ను కళాశాల ప్రిన్సిపాల్ పద్మ, అధ్యాపకులు గురువారం ఘనంగా సత్కరించారు.