తాలిపేరుకు వరద ఉధృతి | - | Sakshi
Sakshi News home page

తాలిపేరుకు వరద ఉధృతి

Sep 4 2025 6:01 AM | Updated on Sep 4 2025 6:01 AM

తాలిపేరుకు వరద ఉధృతి

తాలిపేరుకు వరద ఉధృతి

చర్ల: తాలిపేరు ప్రాజెక్ట్‌లోకి వరద నీటి ప్రవాహం ఒక రోజు పెరుగుతుండగా, మరో రోజు తగ్గుతోంది. వారం రోజులుగా ఇదే పరిస్థితి నెలకొంటోంది. బుధవారం మధ్యాహ్నం నుంచి ప్రాజెక్ట్‌లో భారీగా వరదనీరు వస్తుండటంతో 14 గేట్లను ఎత్తి ఉంచి 30,054 క్యూసెక్కుల నీటిని దిగువన గోదావరిలోకి విడుదల చేస్తున్నారు. దీంతో దిగువన ఉన్న తాలిపేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. మరోవైపు గోదావరిలో కూడా వరద ఉధృతి ఉండగా, బ్యాక్‌ వాటర్‌తో తేగడలోని హైలెవల్‌ వంతెన వద్ద వరద ఉగ్రరూపం దాల్చుతోంది.

కిన్నెరసాని ప్రాజెక్ట్‌

గేటు ఎత్తివేత

పాల్వంచరూరల్‌: ఎగువన కురుస్తున్న వర్షానికి కిన్నెరసాని జలాశయానికి వరద ఉధృతి పెరిగింది. 407 అడుగుల నీటినిల్వ సామర్థ్యం కలిగిన కిన్నెరసాని రిజర్వాయర్‌లోకి ఎగువ నుంచి 1,700 క్యూసెక్కుల వరదనీరు వస్తోంది. దీంతో బుధవారం నీటిమట్టం 405.30 అడుగులకు పెరిగింది. ప్రాజెక్ట్‌ ఒక గేటు ఎత్తి ఉంచి 5 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

కారు ఢీకొని మహిళ మృతి

మణుగూరు టౌన్‌: కారు ఢీకొని మహిళ మృతి చెందిన సంఘటన బుధవారం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. పినపాక మండలానికి చెందిన కోడిరెక్కల సావిత్రి (55) మణుగూరు నుంచి భద్రాచలం వైపు ఆటోలో వెళ్తోంది. ఈ క్రమంలో తోగ్గూడెం శివారులో ఎదురుగా వచ్చిన కారు ఆటోను ఢీ కొట్టింది. దీంతో సావిత్రి రోడ్డుపై పడిపోవడంతో తీవ్రగాయాలయ్యాయి. అపస్మారక స్థితికి చేరిన ఆమెను 108 ద్వారా ప్రభుత్వాస్పత్రికి తరలించా రు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందిందని తెలిపారు. కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ రంజిత్‌ తెలిపారు.

అటు సీత.. ఇటు రాధ!

ఇందిరమ్మ ఇంటి స్థలంపై వివాదం

బోనకల్‌: మండలంలోని రాపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇంటి స్థల విషయమై వివాదం నెలకొనగా ఇరువర్గాలతో అధికారులు చర్చించారు. గతంలో కులవృత్తులతో జీవిస్తున్న పలువురికి ప్రభుత్వం స్థలాలు కేటాయించగా గ్రామంలో రాచకొండ సీతకు సైతం కేటాయించారు. కొన్నేళ్ల పాటు అక్కడే ఉన్న ఆమె మరో గ్రామానికి వెళ్లింది. దీంతో ఆమె బంధువైన రాచకొండ రాధకు ఇటీవల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కావడంతో ఆ స్థలంలో ముగ్గులు పోశారు. గ్రామంలో నాయకులు రెండు వర్గాలుగా ఉండడంతో నిర్మాణం జరపొద్దని ఓ వర్గం, ఆ స్థలాన్ని రాచకొండ రాధ కొనుగోలు చేసిందని ఇంకో వర్గం వారు వాదించారు. ఈ విషయం జిల్లా పంచాయతీ అధికారి దృష్టికి వెళ్లగా ఆమె నెల క్రితం పరిశీలించి వివా దం లేని స్థలంలోనే ఇల్లు నిర్మించుకోవాలని సూ చించారు. దీంతో ఎస్‌ఐ పి.వెంకన్న, తహసీల్దార్‌ రమాదేవి బుధవారం ఇరు వర్గాలను పిలిచి విచా రణ చేపట్టారు. గతంలో కొన్నాళ్లు ఉన్న రాచకొండ సీతను ఈనెల 6న పిలిపించే వరకు ఇరు వర్గా లు సమన్వయంతో ఉండాలని సూచించారు.

వ్యక్తిపై పోక్సో కేసు నమోదు

వైరా: వైరా పాత ఎకై ్సజ్‌ స్టేషన్‌ రోడ్డులో ఓ బాలికపై లైంగికదాడికి ప్రయత్నించిన వ్యక్తిపై పోక్సో కేసు నమోదైంది. కాలనీకి చెందిన ఓ బాలిక ఇంట్లో ఉండగా దుగ్గిరాల రత్తయ్య వెనుక నుంచి వెళ్లి లైంగికదాడి చేసేందుకు ప్రయత్నించాడు. ఆ సమయాన బాలిక తండ్రి ఇంట్లోనే నిద్రిస్తున్నా డు. బాలిక కేకలు వేయడంతో రత్తయ్య పారిపోయాడు. కాగా బుధవారం పోక్సో కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని ఎస్‌ఐ పి.రామారావు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement