
ప్రశాంతంగా ముగిసిన పోలింగ్
పాల్వంచ: తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ అసిస్టెంట్ ఇంజనీర్స్ అసోసియేషన్ ఎన్నికలు స్థానిక ఇంజనీర్స్ అసోసియేషన్ హాల్‌లో మంగళవారం ప్రశాంతంగా ముగిశాయి. ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిర్వహించిన పోలింగ్‌లో 305 మందికి గాను 278 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. జెన్‌కో, ట్రాన్స్‌కో, ఎన్‌పీడీసీఎల్, ఎస్‌పీడీసీఎల్ ఏఈలు పోలింగ్‌లో పాల్గొన్నారు. జనరల్ సెక్రటరీగా టి.మహేష్, ఫైనాన్స్ సెక్రటరీగా జి.శ్రీపాల్‌రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు తెలిసింది. రాష్ట్రంలోని 25 చోట్ల ఎన్నికలు నిర్వహించగా ఈనెల 19న పాల్వంచలోనే ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్లు తెలిపారు. ఎన్నికల అధికారులుగా బి.రవి, జి.తేజస్వి, ఆర్.రమేష్, కె.మనోజ్, ఐ.రాజు వ్యవహరించారు.
ముగిసిన నామినేషన్ల పర్వం..
కేటీపీఎస్, బీటీపీఎస్, వైటీపీఎస్ ఉద్యోగుల క్రెడిట్ సొసైటీ(పాల్వంచ) ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ మంగళవారం ముగిసింది. 3,008 మంది సభ్యులున్న ఈ సొసైటీకి 13 డైరెక్టర్ పోస్ట్‌లకు మొత్తం 46 మంది నామినేషన్లు దాఖలు చేశారు.