
గురుకుల విద్యార్థుల ప్రతిభ
అన్నపురెడ్డిపల్లి (చండ్రుగొండ) : ఇటీవల తెలంగాణ జూడో అసోసియేషన్ నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల్లో అన్నపురెడ్డిపల్లి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థులు సత్తా చాటారు. బి.ప్రశాంత్ గోల్డ్‌మెడల్ సాధించి ఉత్తమ క్రీడాకారుడిగానగదు అవార్డు పొందాడు. చల్లా రుషి, చల్లా రుత్విక్ సిల్వర్ మెడల్స్ సాధించారు. ప్రశాంత్ సెప్టెంబర్‌లో లక్నోలో జరిగే జాతీయస్థాయి పోటీలకు హాజరుకానున్నాడు. ఈ సందర్భంగా శుక్రవారం పాఠశాలలో ప్రతిభ చాటిన విద్యార్థులను ఉపాధ్యాయులు అభినందించారు. ప్రిన్సిపాల్ టి.బాలరాజు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.