
భక్తిశ్రద్ధలతో వరలక్ష్మీ వ్రతం
భద్రాచలం: భద్రాచల శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలో శ్రావణ మాస రెండో శుక్రవారం వరలక్ష్మీ వ్రతం ఘనంగా నిర్వహించారు. ఉదయం ఉపాలయంలోని శ్రీ లక్ష్మీతాయారు అమ్మవారికి ఉదయం ప్రత్యేక స్నపనం, పంచామృతంతో అభిషేకం జరిపారు. సాయంత్రం బేడా మండపంలో పల్లకీ సేవగా స్వామివారి ఉత్సవమూర్తులను, అమ్మవారి ప్రతిమను తీసుకొచ్చి బేడా మండపంలో కొలు వుదీర్చారు. అర్చకులు సామూహిక కుంకుమార్చన జరిపారు. ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం స్వామివారిని దర్శించుకున్నారు. పూజల్లో ఆలయ ఈఓ ఎల్.రమాదేవి, మహిళలు పెద్ద సంఖ్యలో పా ల్గొన్నారు. శనివారం హయగ్రీవ జయంతి, పవిత్రోత్సవ ముగింపు పూర్ణాహుతి నిర్వహించనున్నారు.
నిత్యాన్నదానానికి విరాళం
దేవస్థానం సన్నిధిలో జరిగే శాశ్వత నిత్యాన్నదానానికి భద్రాచలానికి చెందిన భక్తులు విరాళం అందించారు. రామాలయ సెంటర్‌కు చెందిన ఉడతా రమేష్, అనురాధ దంపతులు రూ.1,00,116లను ఆఓకు అందించగా, ఆమె దాతలకు రశీదు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ శ్రవణ్‌కుమార్, ఆలయ సూపరింటెండెంట్ లింగాల సాయిబాబు తదితరులు పాల్గొన్నారు.
రామాలయంలో
సామూహిక కుంకుమార్చన
నేడు హయగ్రీవ జయంతి అభిషేకం

భక్తిశ్రద్ధలతో వరలక్ష్మీ వ్రతం