కార్మికులకు రక్షణ కల్పించాలి | - | Sakshi
Sakshi News home page

కార్మికులకు రక్షణ కల్పించాలి

Aug 9 2025 5:07 AM | Updated on Aug 9 2025 5:07 AM

కార్మికులకు రక్షణ కల్పించాలి

కార్మికులకు రక్షణ కల్పించాలి

మణుగూరు టౌన్‌: కార్మికుల రక్షణ, ఆరోగ్య పరిరక్షణపై యాజమాన్యం దృష్టి సారించాలని డీఎంఎస్‌(మైనింగ్‌) ఎం.ఉమేశ్‌ సావర్కర్‌, డీఎంఎస్‌ (ఎలక్ట్రికల్‌) ఆనంద్‌వెల్‌ అన్నారు. శుక్రవారం ఇల్లెందు క్లబ్‌లో మణుగూరు ఏరియాస్థాయి 18వ రక్షణ త్రైపాక్షిక సమావేశం డైరెక్టర్‌ (పీఅండ్‌పీ) కొప్పుల వెంకటేశ్వర్లు అధ్యక్షతన నిర్వహించారు. తొలుత అధికారులందరూ రక్షణ ప్రతిజ్ఞ చేశారు. 17వ సమావేశంలో గుర్తించిన సమస్యల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డీఎంఎస్‌లు మాట్లాడుతూ ప్రతి గనిలో రక్షణపై ఉద్యోగులకు అవగాహన కల్పించాలన్నారు. రాత్రి షిఫ్ట్‌ నిర్వహించే ఉద్యోగుల కోసం లైటింగ్‌ వ్యవస్థను మెరుగుపర్చాలని చెప్పారు. అనంతరం డిప్యూటీ డైరెక్టర్‌ (మైనింగ్‌) సనత్‌కుమార్‌ మాట్లాడారు. సింగరేణి డైరెక్టర్‌ కొప్పుల వెంకటేశ్వర్లు, జీఎం (సేఫ్టీ) కార్పొరేట్‌ చింతల శ్రీనివాస్‌ మాట్లాడుతూ ఉద్యోగులు తప్పనిసరిగా రక్షణ సూత్రాలు పాటించాలని అన్నారు. యంత్రాల పనిగంటలు పెంచి ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించాలని కోరారు. కేసీహెచ్‌పీలో దుమ్ముధూళి నివారణకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. 2025–26 లక్ష్య సాధనకు సమష్టి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఏబీసీ రక్షణ సూత్రంపై అవగాహన కల్పించారు. ఏరియా జీఎం దుర్గం రాంచందర్‌ మాట్లాడుతూ ప్రమాద రహిత ఉత్పత్తికి పటిష్టంగా ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఆ తర్వాత కార్మిక సంఘాల నాయకులు మాట్లాడారు. ఈ సమావేశంలో కొత్తగూడెం ఏరియా జీఎం (సేఫ్టీ) కృష్ణ గోపాల తివారి, గుర్తింపు, ప్రాతినిధ్య కార్మిక సంఘాలు ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీ నాయకులు వై.రాంగోపాల్‌, త్యాగరాజన్‌, కృష్ణంరాజు, పలువురు అధికారులు పాల్గొన్నారు.

రక్షణ త్రైపాక్షిక సమావేశంలో

డీఎంఎస్‌ ఉమేశ్‌ సావర్కర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement