
రెండు రోజుల్లో కుమారుడి పెళ్లి..
పాల్వంచ: రెండు రోజుల్లో కుమారుడి వివాహం జరగాల్సి ఉంది. అంతలోనే తండ్రి అనారోగ్యంతో మృతి చెందాడు. స్థానికుల కథనం ప్రకారం... పాల్వంచ పట్టణంలోని గాంధీనగర్‌కు చెందిన రిటైర్డ్ పోస్ట్‌మాన్ నంది వీరభద్రరావు(63) కొంతకాలంగా అనారోగ్య సమస్యతో బాధపడుతున్నాడు. కాగా అతని చిన్న కుమారుడి వివాహం బుధవారం జరగాల్సి ఉంది. ఇందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వీరభద్రరావు ఆరోగ్యం క్షీణించి మృతి చెందడంతో వివాహం వాయిదా పడింది. శుభకార్యం జరగాల్సిన ఇంట్లో విషాదం నెలకొంది.
అనారోగ్యంతో తండ్రి మృతి