
అద్దె భవనాలే ..
ఆదాయం సమకూరుస్తున్నా
కొత్తగూడెంటౌన్: రవాణాశాఖ ప్రభుత్వానికి ముఖ్యమైన ఆదాయ వనరుగా ఉంది. కానీ ఆ శాఖ కార్యాలయాలు మాత్రం అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. జిల్లాలో కొత్తగూడెం, భద్రాచలంలలో ఆర్టీఓ కార్యాలయాలు ఉండగా, రెండూ అద్దె భవనాల్లోనే ఉన్నాయి. అద్దె భవనాల్లోనే అధికారులు, సిబ్బంది విధులు నిర్వరిస్తున్నారు. నెలకు రూ. లక్షల్లో ఆదా యం గడిస్తున్నా జిల్లా రవాణాశాఖకు ఇప్పటివరకు సొంత భవనం లేదు. 20 ఏళ్లుగా అద్దె చెల్లిస్తూ సింగరేణి క్వార్టర్‌లో కార్యాలయాన్ని నెట్టుకొస్తున్నారు.
పేరు నమోదు ఒకచోట.. టెస్ట్ మరో చోట
రైటర్‌బస్తీ సమీపంలోని జిల్లా కోర్టు భవనాల సముదాయం వెనుక భాగంలో ఉన్న సింగరేణి సంస్థకు చెందిన క్వార్టర్‌లో జిల్లా రవాణాశాఖ కార్యాలయం ఉంది. ప్రస్తుతం ప్రతీ నెల అద్దె చెల్లిస్తూ అధికారులు, సిబ్బంది విధులను నిర్వహిస్తున్నారు. కొత్తగూడెం, భద్రాచలంలతో పాటు అశ్వారావుపేటలో డ్రైవింగ్ టెస్టింగ్ సెంటర్లు ఉన్నాయి. వాహనాల ఫిట్‌నెస్, రిజిస్ట్రేషన్, లైసెన్స్, ట్రాన్ప్‌పోర్ట్ పర్మిషన్ తదితర అవసరాల కోసం నిత్యం వందల మంది వాహనదారులు ఆర్టీఓ కార్యాలయానికి వస్తుంటారు. ఈ భవనం పాతది కావడంతో ఇబ్బందులు కూడా ఎదురవుతున్నాయని వాహనదారులు పేర్కొటున్నారు. డ్రైవింగ్ టెస్టు కోసం కార్యాలయానికి కిలోమీటర్ ఉన్న రామవరంలోని డ్రైవింగ్ టెస్టింగ్ ట్రాక్‌కు వెళ్లాల్సి ఉంటుంది. కొత్తగూడెంలోని జిల్లా కార్యాలయంలో పేరు నమోదు చేసుకుని టెస్టింగ్ కోసం వెళ్లాల్సి వస్తోందని వాహనదారులు వాపోతున్నారు.
స్థలం కేటాయించినా..
జిల్లా రవాణాశాఖ కార్యాలయ భవనం, డ్రైవింగ్ టెస్టింగ్ ట్రాక్‌ల నిర్మాణానికి 2016లో ప్రభుత్వం రామవరం సీఆర్‌పీ క్యాంప్ సమీపంలో దాదాపు 8 ఎకరాల స్థలం కేటాయించింది. కానీ ఇప్పటివరకు అక్కడా పునాది రాయి కూడా వేయలేదు. బడ్జెట్ సమస్య వల్లే ఆలస్యమవుతోందని సంబంధిత అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పటికై నా ఆర్టీఏ ఉన్నతాధికారులు స్పందించి నిధులు మంజూరు చేసి, సొంత భవనాలు నిర్మించాలని పలువురు కోరుతున్నారు.
జిల్లాలో సొంత భవనాల్లేని
ఆర్టీఓ కార్యాలయాలు
జిల్లా కేంద్రంతోపాటు
భద్రాచలంలోనూ అదే పరిస్థితి
కొత్తగూడెంలో 20 ఏళ్లుగా
సింగరేణి క్వార్టర్‌లోనే నిర్వహణ
స్థలం కేటాయించినా నిధులివ్వని
ఆర్టీఏ ఉన్నతాధికారులు

అద్దె భవనాలే ..