విద్యుదాఘాతంతో యువకుడి మృతి | - | Sakshi
Sakshi News home page

విద్యుదాఘాతంతో యువకుడి మృతి

Aug 5 2025 6:32 AM | Updated on Aug 5 2025 6:32 AM

విద్య

విద్యుదాఘాతంతో యువకుడి మృతి

కరకగూడెం: విద్యుదాఘాతంతో ఓ యువకుడు మృతి చెందిన సంఘటన సోమవారం జరిగింది. పోలీసు ల కథనం ప్రకారం.. మండలంలోని భట్టుపల్లి గ్రామానికి చెందిన బిలపాటి నరేందర్‌ (18) వరి పొలంలో మోటార్‌ ఆన్‌ చేసేందుకు వెళ్లాడు. మెయిన్‌ లైన్‌ నుంచి వచ్చిన 2 కోర్‌ సర్వీస్‌ కరెంట్‌ వైరులోని ఓ సింగిల్‌ కోర్‌ వైరును న్యూట్రల్‌ వైరుగా భావించి.. పొరపాటున ఫేస్‌ వైరును పొలంలోని ఇనుప కంచె (ఫెన్సింగ్‌)కు తగిలించాడు. ఆ తర్వాత మోటార్‌ పైపును సరిచేసేందుకు ముందుకు వెళ్లగా ఫెన్సింగ్‌కు తాకి విద్యుదాఘాతంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ దుర్ఘటనను గమనించిన స్థానిక రైతు ఇర్రి వెంకన్న ఫెన్సింగ్‌కు ఉన్న తీగలను తొలగించి పెనుప్రమాదాన్ని నివారించాడు. యువకుడి మృతితో తండ్రి రాంబాబు సొమ్మసిల్లి పడిపోయాడు. తల్లి మణెమ్మ కన్నీరు మున్నీరుగా విలపించింది. మృతుడి సోదరుడు శ్యామ్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన లారీ

భద్రాద్రి జిల్లా వాసి మృతి

కొణిజర్ల: ద్విచక్రవాహనాన్ని వెనక నుంచి లారీ ఢీకొట్టిన ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. కొణిజర్ల ఎస్‌ఐ జి.సూరజ్‌ వెల్లడించిన వివరాలు... భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలం మామిడి గుండాలకు చెందిన ముక్తి భూపతి(38) ఓ ప్రైవేట్‌ బీమా కంపెనీలో పనిచేస్తున్నాడు. వైరాలో మార్కెటింగ్‌ ఏజెంట్ల శిక్షణ సోమవారం జరగగా ఆయన హాజరై తిరిగి ఇంటికి ద్విచక్రవాహనంపై బయలుదేరాడు. మార్గమధ్యలో కొణిజర్ల ఎంపీడీఓ కార్యాలయం సమీపాన ఆయన బైక్‌ను వెనక నుంచి కంటైనర్‌ లారీ ఢీకొట్టడమే కాక టైరు భూపతి పైనుంచి వెళ్లడంతో తీవ్ర గాయాల పాలై ఘటనాస్థలిలోనే మృతి చెందాడు. మృతుడికి భార్య తులసి, ఇద్దరు కూతుళ్లు, ఓ కుమారుడు ఉన్నారు. భూపతి సోదరుడు విజయ్‌ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.

నీటి తొట్టిలో పడి చిన్నారి మృతి

జూలూరుపాడు: మండలంలోని మాచినేనిపేటతండా గ్రామ పంచాయతీ పెద్దతండాలో సోమవారం విషాదం చోటు చేసుకుంది. స్థానికులు, కుటుంబసభ్యుల కథనం ప్రకారం... పెద్దతండాకు చెందిన భూక్యాగోపి నాయక్‌, సరస్వతి దంపతులకు 26 నెలల కుమార్తె తన్విశ్రీ, 8 నెలల బాబు తన్విష్‌ ఉన్నారు. చిన్నారి తన్విశ్రీ పక్కన ఉన్న అమ్మమ్మ జ్యోతి ఇంటి ఆవరణలో ఆడుకుంటూ వెళ్లి నీటి తొట్టిలో పడింది. ఆ సమయంలో అమ్మమ్మ ఇంట్లో ఎవరూ లేరు. కొద్దిసేపటికి పాప కన్పించలేదని తల్లి, కుటుంబ సభ్యులు వెతకగా నీటి తొట్టిలో కన్పించింది. బయటకు తీసి స్థానిక గ్రామీణ వైద్యుడి తీసుకెళ్లగా, అప్పటికే మృతిచెందినట్లు వైద్యుడు తెలిపారు. చిన్నారిమృతితో తల్లిదండ్రులు, బంధువులు గుండెలవిసేలా రోదిచారు. తన్వి శ్రీకి 8 నెలల తమ్ముడు తన్విష్‌ ఉన్నాడు. చిన్నారి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

విద్యుదాఘాతంతో యువకుడి మృతి1
1/1

విద్యుదాఘాతంతో యువకుడి మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement