
వైద్య శిబిరాలు నిర్వహించాలి
జూలూరుపాడు: మలేరియా, డెంగీ ప్రభావిత ప్రాంతాల్లో వైద్య శిబిరాలు నిర్వహించాలని డీఎంహెచ్‌ఓ డాక్టర్ జయలక్ష్మి అన్నారు. జూలూరుపాడు పీహెచ్‌సీని సోమవారం ఆమె తనిఖీ చేశారు. రికార్డులు పరిశీలించి, ప్రసవాలపై ఆరా తీశారు. అనంతరం మాట్లాడుతూ.. నేషనల్ హెల్త్ ప్రోగ్రామ్‌లో అన్ని అంశాల్లో 100 శాతం లక్ష్యం సాధించాలని వైద్యులు, సిబ్బందిని ఆదేశించారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలుతాయని, అవసరమైన మందులు అందుబాటులో ఉంచాలని సూచించారు. ఆశ కార్యకర్తల సాయంతో ప్రతీ గ్రామంలో ర్యాపిడ్ ఫీవర్ సర్వే నిర్వహించాలన్నారు. పీహెచ్‌సీలో సాధారణ ప్రసవాల సంఖ్య పెంచాలని, వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించాలని ఆదేశించారు. అనంతరం పీహెచ్‌సీ ఆవరణలో మునగ మొక్కలు నాటారు. కార్యక్రమంలో పీహెచ్‌సీ వైద్యాధికారి వెంకటేశ్వర్లు, డాక్టర్ తేజస్విని, సీహెచ్‌ఓ ఎం.రామకృష్ణ, స్టాఫ్‌నర్సు సుకుమారి, ఫార్మసిస్టు జి.శశికళ, ఎల్‌టీ జగదీష్ పాల్గొన్నారు.
ఆరోగ్య కార్యక్రమాలు అమలు చేయాలి
కొత్తగూడెంఅర్బన్: క్షేత్రస్థాయిలో ఆరోగ్య కార్యక్రమాలు సమర్థంగా అమలు చేయాలని డీఎంహెచ్‌ఓ జయలక్ష్మి అన్నారు. తన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. సికిల్‌సెల్ వ్యాధిపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. అదనంగా పోషక విలువలు అందించడంతో పాటు ఆరోగ్య ప్రయోజనాలు కల్పించే మునగ విశిష్టతను వివరించారు. సమావేశంలో ప్రోగ్రామ్ అధికారులు పుల్లారెడ్డి, తేజశ్రీ, ఎండీ ఫైజ్ మోహియుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం నవజాత శిశువులకు రెటినోపతి ఆఫ్ ప్రిమెచ్యూరిటి కార్యక్రమం అమలుపై జిల్లా ఇన్‌చార్జ్ సుభద్రతో సమావేశం నిర్వహించారు.
డీఎంహెచ్‌ఓ జయలక్ష్మి