
కమనీయం.. రామయ్య నిత్య కల్యాణం
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి నిత్యకల్యాణ వేడుక బుధవారం కమనీయంగా సాగింది. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామి వారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు.
స్వచ్ఛమైన తాగునీరు
సరఫరా చేయాలి
భగీరథ గ్రిడ్‌ను పరిశీలించిన ఈఎన్‌సీ..
దుమ్ముగూడెం : ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించాలని, ఈ విషయంలో నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదని మిషన్ భగీరథ ఈఎన్‌సీ కృపాకర్‌రెడ్డి స్పష్టం చేశారు. మండలంలోని పర్ణశాల గ్రామంలో గల గ్రిడ్‌ను బుధవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా తాగునీటి సరఫరాలో ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇబ్బందులు ఎదురైతే తన దృష్టికి తేవాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్‌ఈ శేఖర్‌రెడ్డి, ఈఈలు తిరుమలేష్, నళిని, డీఈలు బ్రహ్మదేవ్, యేసుబాబు తదితరులు పాల్గొన్నారు.
మిట్టగూడెంలో..
అశ్వాపురం: మండలంలోని మిట్టగూడెంలో రథంగుట్ట వద్ద మిషన్ భగీరథ వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్‌ను కృపాకర్‌రెడ్డి బుధవారం పరిశీలించారు. నీటి సరఫరాపై అధికారులతో మాట్లాడి పలు సలహాలు, సూచనలు చేశారు. కార్యక్రమంలో సీఈలు శ్రీనివాస్, మధుబాబు, ఎస్‌ఈలు నరేందర్‌రెడ్డి, శేఖర్‌రెడ్డి, డీఈ మహేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
న్యాయవాద పరిషత్
జిల్లా కమిటీ ఎన్నిక
కొత్తగూడెంటౌన్: న్యాయవాద పరిషత్ జిల్లా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కొత్తగూడెం జిల్లా కోర్టు ఆవరణలో బుధవారం పరిషత్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొండపల్లి విజయ్‌కుమార్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడిగా అనుబ్రోలు రాంప్రసాద్‌రావు, ఉపాధ్యక్షులుగా జి.రామచంద్రారెడ్డి, రేపాక మనోరమ, కిరణ్, కాసాని రమేష్, కార్యదర్శులుగా పిల్లి వేణువాసురావు, ఎస్.రమణారెడ్డి, వీర మధుసూదన్, జి. నాగరాజు, ఎల్. రవినాయక్, ట్రెజరర్‌గా దేవేంద్ర, మహిళా ప్రతినిధిగా నల్లమల్ల ప్రతిభ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా పాతూరి పాండురంగ విఠల్, కార్య నిర్వాహక కమిటీ సభ్యులుగా దూడెం మురళి ఎన్నికయ్యారు.
అప్రెంటిస్ శిక్షణకు
దరఖాస్తుల ఆహ్వానం
ఖమ్మంమయూరిసెంటర్: ఇంజనీరింగ్, నాన్– ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అభ్యర్థులకు ఖమ్మం రీజియన్‌లోని ఆర్టీసీ డిపోల్లో మూడేళ్ల అప్రెంటిస్ శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆర్‌ఎం సరిరామ్ తెలిపారు. గ్రాడ్యుయేషన్, వివిధ కోర్సుల్లో ఇంజనీరింగ్ పూర్తిచేసిన వారే కాక డిప్లొమా చదివిన అర్హులని వెల్లడించారు. 2021 విద్యాసంవత్సరం తర్వాత ఉత్తీర్ణులైన వారికి నేషనల్ అప్రెంటిస్ ట్రైనింగ్ స్కీం ద్వారా ఇచ్చే శిక్షణ కోసం ఈనెల 23వ తేదీ లోగా నాట్స్ ఎడ్యుకేషన్ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కాగా, శిక్షణ కాలంలో స్టైఫండ్ అందుతుందని ఆర్‌ఎం తెలిపారు.

కమనీయం.. రామయ్య నిత్య కల్యాణం

కమనీయం.. రామయ్య నిత్య కల్యాణం