
అసాంఘిక శక్తులపై పటిష్ట నిఘా
కొత్తగూడెంటౌన్ : అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై పటిష్ట నిఘా ఏర్పాటు చేయాలని ఎస్పీ రోహిత్‌రాజు అన్నారు. ప్రతీ కేసులో సమగ్ర విచారణ నిర్వహించి నేరస్తులకు శిక్ష పడేలా చూడాలన్నారు. జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో మంగళవారం నిర్వహించిన నేర సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసుల విచారణలో జాప్యం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. బాధితులకు న్యాయం చేయాలని, నిర్లక్ష్యంగా వ్యవహరించే అఽధికారులపై చర్యలు తప్పవని అన్నారు. పెట్రోలింగ్, బ్లూకోల్ట్స్ వాహనాలతో నిరంతరం రోడ్లపై తిరుగుతూ ఉండాలని, గంజాయి, మత్తు పదార్థాలు తరలించే వారిపై నిఘా ఏర్పాటు చేయాలని సూచించారు. జిల్లాలో హాట్‌స్పాట్ ప్రాంతాలను గుర్తించాలన్నారు. అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో సీసీ కెమెరాలను అమర్చాలని, వ్యాపార సముదాయాలు, ఇళ్లలో కూడా ఏర్పాటుచేసేలా అవగాహన కల్పించాలని ఆదేశించారు. ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి కేసులను సత్వరమే పరిష్కరించాలని, చోరీకి గురైన సొత్తును రికవరీ చేయాలని అన్నారు. సైబర్ మోసాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. అనంతరం జోనల్ స్థాయిలో పతకాలు సాధించిన పోలీసు అధికారులు, సిబ్బందిని అభిపందించారు. సమావేశంలో భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్‌కుమార్ సింగ్, కొత్తగూడెం, పాల్వంచ, మణుగూరు, ఇల్లెందు డీఎస్పీలు అబ్దుల్ రెహమాన్, సతీష్‌కుమార్, రవీందర్‌రెడ్డి చంద్రభాను, డీసీఆర్బీ డీఎస్పీ మల్ల య్యస్వామి తదితరులు పాల్గొన్నారు.
ఎస్పీ రోహిత్‌రాజు