
● తాగునీటి సమస్య తీర్చాలి..
‘మా గ్రామానికి అంగన్‌వాడీ కేంద్రం మంజూరు చేసి విద్య అందించాలి.. బోరింగ్ నుంచి వస్తున్న బురదనీరు తాగి రోగాల బారిన పడుతున్నాం.. మంచినీటి సౌకర్యం కల్పించాలని ఏడాది కాలంగా తిరుగుతున్నా ఫలితం లేదు’ అంటూ చుంచుపల్లి మండలం పాలవాగు గ్రామ గిరిజనులు వాపోయారు. గ్రామానికి చెందిన చోడి లక్ష్మణ్, మడివి రాజు, సోడె భూమయ్య, సోడె మల్లేష్, మడివి రాజు, మన్నెం వెంకటయ్య, మన్నె వెంకటేశ్వర్లు సహా 30 మంది సోమవారం ప్రజావాణికి హాజరై కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపారు. ఆ తర్వాత అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్‌కు వినతిపత్రం అందజేశారు. పిల్లలను బడిలో చేర్పించాలంటే కిలోమీటర్ల దూరంలోని పెనగడప, ములుగుగూడెం వెళ్లాలని, వర్షం వస్తే మధ్యలో వాగు పొంగి రాకపోకలు ఉండవని తెలిపారు. సత్వరమే సమస్యలు పరిష్కరించాలని కోరారు.