
ఆ ఐదింటి సంగతేంటి?
బుధవారం శ్రీ 16 శ్రీ జూలై శ్రీ 2025
నేత్రపర్వంగా
రామయ్య నిత్యకల్యాణం
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి నిత్యకల్యాణ వేడుక మంగళవారం నేత్రపర్వంగా సాగింది. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామి వారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. కాగా, మంగళవారాన్ని పురస్కరించుకుని అభయాంజనేయస్వామి వారికి అభిషేకం, ప్రత్యేక పూజలు చేశారు.
సింగరేణి మహిళా
కళాశాలలో తనిఖీలు
సూపర్‌బజార్(కొత్తగూడెం): సింగరేణి మహిళా డిగ్రీ, పీజీ కళాశాలను కాకతీయ యూనివర్సిటీ ప్రొఫెసర్లు మంగళవారం తనిఖీ చేశారు. కాలేజీలో నూతనంగా ప్రవేశపెట్టిన బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ కోర్సుకు సంబంధించి మౌలిక సదుపాయాలు, లైబ్రరీ, ప్రయోగశాలలు, తరగతి గదులు, ఇతర వనరులు ఉన్నాయా, అధ్యాపకులు సరిపడా ఉన్నారా అనే వివరాలను కేయూకు చెందిన ప్రొఫెసర్లు పి.వరలక్ష్మి, నరసింహాచారి, జి. హనుమంతరావు అడిగి తెలుసుకున్నారు. సౌకర్యాలు, వనరులపై వారు సంతృప్తి వ్యక్తం చేశారని ప్రిన్సిపాల్ డాక్టర్ సీహెచ్ శారద తెలిపారు.
నేడు స్మారక స్తూపాల ఆవిష్కరణ
ఇల్లెందు: సీపీఐ(ఎంఎల్) మాస్‌లైన్ ఆధ్వర్యాన ఇల్లెందులో నిర్మించిన అమరవీరుల స్మారక స్తూపాలను బుధవారం ఆవిష్కరించనున్నారు. గతంలో ప్రజాపంథాగా ఉన్నప్పుడు పార్టీ నిర్మాణం, పటిష్టతకు కృషి చేసిన చండ్ర కృష్ణమూర్తి(ఎల్లన్న), గండి యాదన్న, రాయల చంద్రశేఖర్ స్మారక స్తూపాలను నిర్మించారు. వీటిని నేడు ఆవిష్కరించాక ఎల్లన్న విజ్ఞాన కేంద్రంలో సభ నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. ఈ సభ విజయవంతానికి కొద్దిరోజులుగా విస్తృత ప్రచారం చేస్తున్నారు. కాగా, బుధవారం జరిగే సభలో మాస్‌లైన్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రదీప్‌సింగ్ ఠాగూర్, రాష్ట్ర కార్యదర్శి పి.రంగారావు, నాయకులు చండ్ర అరుణ, కే.జీ.రాంచందర్, కె.రంగయ్య, కె.రమ, గుమ్మడి నర్సయ్య, ముద్ధా భిక్షం, నాయిని రాజు, ఈసం శంకర్, రాయల విమల తదితరులు పాల్గొననున్నారు.
భద్రాచలం: ఏపీలో విలీనమైన ఐదు గ్రామపంచాయతీల సమస్య మరింతగా ముదురుతోంది. పోలవరం ముంపు పేరుతో అన్యాయంగా తమను ఏపీలో కలిపారని ఆయా గ్రామాల వారు భగ్గుమంటున్నారు. ఆ పంచాయతీలను విడదీసి భద్రాచలం పట్టణాన్ని ముక్కలు చేశారంటూ భద్రాద్రి వాసులూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బుధవారం కేంద్ర జలమండలి శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు రేవంత్‌రెడ్డి, చంద్రబాబునా యుడు భేటీ కానున్న నేపథ్యంలో ఈ ఐదు గ్రామాలపై చర్చించాలని అందరూ వేడుకుంటున్నారు.
సమస్యపై పట్టింపేది..
ఏపీలో విలీనమైన యటపాక, గుండాల, పురుషోత్తపట్నం, పిచుకలపాడు, కన్నాయిగూడెం గ్రామాలు భద్రాచలం మండల పరిధిలో ఉండేవి. 2011 జనాభా లెక్కల ప్రకారం కన్నాయిగూడెంలో 2,161, పిచుకలపాడులో 2,187, గుండాలలో 3,816, పురుషోత్నపట్నంలో 1,372, యటపాకలో 2,410.. మొత్తం 11,946 జనాభా ఉండగా ప్రస్తుతం ఆ సంఖ్య 25 వేలు దాటుతుందని అంచనా. ఇక భద్రాచలంలో నాడు 40 వేల మంది ఉండగా ఇప్పుడు సుమారు లక్ష వరకు ఉండొచ్చని అఽధికారులు అంటున్నారు. పట్టణానికి మూడు వైపులా సరిహద్దులుగా ఆ ఐదు పంచాయతీలు ఉండేవి. ఇవి లేని భద్రాచలం పట్టణాన్ని ఊహించలేమని స్థానికులు చెబుతుంటారు. కానీ రాష్ట్ర విభజన సమయంలో రాత్రికి రాత్రే రాజ్యాంగ సవరణ ద్వారా పోలవరం ముంపు పేరుతో ఈ పంచాయతీలను ఏపీలో విలీనం చేశారు. అయితే తమను తిరిగి తెలంగాణలో కలపాలంటూ దశాబ్దకాలంగా ఆయా గ్రామాలతో పాటు భద్రాచలం వాసులు కూడా డిమాండ్ చేస్తూనే ఉన్నారు. ఇక్కడి నుంచి పోటీచేసిన ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు ఎన్నికల సమయంలో ఈ మేరకు హామీలు గుప్పించినా.. సమస్యను ఢిల్లీ స్థాయికి తీసుకెళ్లడంలో విఫలమవుతున్నారనే విమర్శలు వస్తున్నాయి.
నేటి భేటీలో చర్చించండి..
గోదావరి – బనకచర్ల ప్రాజెక్టుపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సీఎంలు రేవంత్‌రెడ్డి, చంద్రబాబు నాయుడు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్‌తో బుధవారం భేటీ కానున్నారు. ఈ నేపథ్యంలో దశాబ్దకాలంగా పెండింగ్‌లో ఉన్న ఐదు పంచాయతీల సమస్యను చర్చించాలని, ఈ గ్రామాలను తిరిగి తెలంగాణలో కలిపేలా కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకురావాలని ఆయా గ్రామాల ప్రజలు, భద్రాద్రి వాసులు కోరుతున్నారు. ఇరువురు సీఎంలు సానుకూలంగా స్పందించి ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని వేడుకుంటున్నారు.
కార్డియాలజిస్ట్ నియామకం
ఖమ్మంవైద్యవిభాగం: ఖమ్మం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో కార్డియాలజిస్ట్‌గా డాక్టర్ సీతారాం డిప్యూటేషన్‌పై విధులు నిర్వర్తించారు. ఆయన డిప్యూటేషన్ గడువు గత నెలలో ముగియగా చికిత్సలు నిలిచిపోయాయి. దీంతో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, సూర్యాపేట జిల్లాల నుంచి గుండె సంబంధిత సమస్యలతో వచ్చే వారికి ఇబ్బందులు ఎదురుకాగా ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయించాల్సి వచ్చేది. ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లగా మళ్లీ సీతారాంను డిప్యూటేషన్‌పై తీసుకోవాలని నిర్ణయించగా తిరిగి సేవలు అందుబాటులోకి వచ్చాయి.
ఐటీడీఏ పీఓ రాహుల్ వెల్లడి
న్యూస్‌రీల్
విలీన గ్రామాలపై దృష్టి పెట్టాలని వేడుకోలు
తిరిగి తెలంగాణాలో కలపాలని స్థానికుల డిమాండ్
సమస్యలు పట్టించుకోవడం లేదంటూ ఆందోళన
నేటి సీఎంల భేటీలో చర్చించాలని విన్నపాలు

ఆ ఐదింటి సంగతేంటి?

ఆ ఐదింటి సంగతేంటి?

ఆ ఐదింటి సంగతేంటి?

ఆ ఐదింటి సంగతేంటి?