
రేకుల షెడ్డు దగ్ధం
దమ్మపేట: ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో ప్రమాదవశాత్తు రేకుల షెడ్డు దగ్ధమైన ఘటన మండలంలోని పట్వారిగూడెంలో ఆదివారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన సీతారాములు తన కుటుంబంతో అదే గ్రామంలో రేకుల షెడ్డులో నివాసం ఉంటున్నాడు. ఆదివారం తన భార్యతో కలిసి కూలీ పనులకు వెళ్లగా.. వారి కుమారుడు (5) ఇంటికి సమీపంలో ఆడుకుంటున్నాడు. సాయంత్రం ఒక్కసారిగా రేకుల షెడ్డుకు మంటలు అంటుకున్నాయి. గమనించిన స్థానికులు మంటలను ఆర్పే ప్రయత్నం చేయగా, అప్పటికే ఇంట్లో ఉన్న వస్తువులు పూర్తిగా కాలిపోయాయి. విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి, రూ.5,000 తక్షణ ఆర్థిక సహాయంగా అందజేశారు.
కారు బోల్తా
అశ్వారావుపేటరూరల్: అదుపుతప్పి ఓ కారు బోల్తా పడిన ఘటన ఆదివారం మండలంలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. భద్రాచలం నుంచి అశ్వారావుపేట వైపు వస్తున్న కారు మండలంలోని ఆసుపాక సమీపంలో గేదె అడ్డురావడంతో అదుపుతప్పి బోల్తా పడింది. కారులోని భద్రాచలానికి చెందిన ఇద్దరు వ్యక్తులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. కాగా, ఈ ప్రమాదంలో కారు పూర్తిగా ధ్వంసమైంది. ఈ ఘటనపై ఫిర్యాదు రాలేదని స్థానిక ఎస్‌ఐ యయాతిరాజు తెలిపారు.
ఇద్దరికి గాయాలు

రేకుల షెడ్డు దగ్ధం