
రామయ్యకు సువర్ణ తులసీ అర్చన
భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామ చంద్రస్వామి దేవస్థానంలోని మూలమూర్తులకు శని వారం సువర్ణ తులసీ అర్చన పూజలు చేశారు. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం మేళతాళాల నడుమ గర్భగుడి నుంచి ఊరేగింపుగా తీసుకొచ్చి బేడా మండపంలో కొలువుదీర్చా రు. విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం అనంత రం కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి కల్యాణాన్ని శాస్త్రోక్తంగా జరిపారు. వారాంతపు సెలవు దినాలు కావడంతో భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారు.
నిలిచిపోయిన మిషన్ భగీరథ తాగునీటి సరఫరా
పాల్వంచరూరల్: జిల్లావ్యాప్తంగా శనివారం మిషన్ భగీరథ తాగునీటి సరఫరా నిలిచిపోయింది. దీంతో ప్రజలు తాగునీటి కోసం ఇబ్బందులు పడ్డారు. మండల పరిధిలోని తోగ్గూడెం వద్ద ఉన్న భగీరథ నీటిశుద్ధి కేంద్రంలోకి ఇటీవల కురిసిన వర్షాలతో బురద నీరు చేరింది. దీంతో అధికారులు తాగునీటి సరఫరాను నిలిపివేసి శుద్ధి కేంద్రాన్ని శుభ్రం చేశారు. ఆదివారం నుంచి తాగునీటిని సరఫరా చేస్తామని డీఈ సాయి తెలిపారు.
రాక్ క్లైంబింగ్‌లో ప్రతిభ
దుమ్ముగూడెం: మండలంలోని ఏకలవ్య పాఠశాల విద్యార్థులు నల్లగొండ జిల్లా భువనగిరిలో జరిగిన రాష్ట్రస్థాయి రాక్ కై ్లంబింగ్ పోటీల్లో రాణించారు. ఈ మేరకు ప్రిన్సిపాల్ విజేందర్‌సింగ్, వైస్ ప్రిన్సిపాల్ నీరజ్‌యాదవ్‌లు శనివారం వివరాలు వెల్లడించారు. 12 మంది విద్యార్థులు పోటీల్లో పాల్గొనగా, ఏడుగురు ప్రతిభ చూపారు. విజేతలను ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్ అభినందించారు.
భక్తరామదాసు ప్రాజెక్టు నుంచి సాగునీటి విడుదల
కూసుమంచి: మండలంలోని ఎర్రగడ్డ తండా వద్ద భక్తరామదాసు ప్రాజెక్టు నుంచి సాగు అవసరాలకు అధికారులు శనివారం నీటిని విడుదల చేఽశారు. పాలేరు నియోజకవర్గ ప్రత్యేకాధి కారి రమేష్ పూజలు నిర్వహించగా, ప్రాజెక్టు డీఈఈ రమేష్‌రెడ్డి మోటార్ స్విచాన్ చేశారు. ఈ ప్రాజెక్టు ద్వారా కూసుమంచి, తిరుమలాయపాలెం, ఖమ్మంరూరల్, నేలకొండపల్లి మండలాల్లోని ఆయకట్టుతో పాటు చెరువులకు నీరు చేరుతుందని డీఈఈ తెలిపారు. మెట్ట పంటలు, వరి సాగుకు తొలుత పదిరోజులు నీరు సరఫరా చేస్తామని, ఈలోగా పాలేరు రిజర్వాయర్‌కు సాగర్ జలాలు చేరాక చెరువులను పూర్తిస్థాయిలో నింపుతామని వెల్లడించారు. కార్యక్రమంలో నాయకులు భీమిరెడ్డి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.

రామయ్యకు సువర్ణ తులసీ అర్చన