ఆర్టీసీ దుకాణ దారులకు జరిమానా | - | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ దుకాణ దారులకు జరిమానా

Jul 13 2025 7:28 AM | Updated on Jul 13 2025 7:28 AM

ఆర్టీ

ఆర్టీసీ దుకాణ దారులకు జరిమానా

అశ్వారావుపేటరూరల్‌: ఆర్టీసీ బస్టాండ్‌ ఆవరణలోని పలువురు వ్యాపారులు, దుకాణాదారులకు సత్తుపల్లి ఆర్టీసీ డిపో అసిస్టెంట్‌ మేనేజర్‌ పి.విజయశ్రీ జరిమానా విధించారు. శనివారం ఆమె అశ్వారావుపేట ఆర్టీసీ బస్టాండ్‌తోపాటు సైకిల్‌స్టాండ్‌, పలు దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. సైకిల్‌ స్టాండ్‌ నిర్వాహకుడు విని యోగదారుల వద్ద నుంచి నిబంధనలకు విరుద్ధంగా అధికగా వసూళ్లకు పాల్పడుతున్నట్లు వచ్చిన ఫిర్యాదుతో రూ.1000 జరిమానా విధించారు. బస్టాండ్‌లోని మరుగుదొడ్లను తనిఖీ చేసి అపరిశుభ్రంగా ఉండటాన్ని గమనించి నిర్వాహకురాలికి రూ.1000, ఫాస్ట్‌ ఫుడ్‌ సెంటర్‌కు ఆర్టీసీ కేటాయించిన స్థలం కంటే అధికంగా ఆక్రమించినట్లు గుర్తించి బాధ్యురాలికి రూ.1000 చొప్పున జరిమానా విధించి రశీదులు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె మా ట్లాడుతూ.. ఆర్టీసీ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే సహించేది లేదని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏడీసీపీ అప్పారావు, సిబ్బంది పాల్గొన్నారు.

చిన్నారిపై కుక్కల దాడి

బూర్గంపాడు: బూర్గంపాడులోని గౌతమీపురంలో ఓ చిన్నారిపై కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. గౌతమీపురానికి చెందిన మందా ప్రవీణ్‌ కుమార్తె యసిక శని వారం ఇంటి బయట ఆడుకుంటుండగా ఒక్కసారిగా కుక్కలు దాడికి పాల్పడ్డాయి. ఆ చిన్నారి మెడను కొరికేందుకు కుక్కలు ప్రయత్నిస్తుండగా స్థానికులు రాళ్లు విసరటంతో ఆమె ముఖాన్ని కరిచాయి. తీవ్రంగా గాయపడిన చిన్నారిని కుటుంబ సభ్యులు స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు.

సోదాల పేరుతో దౌర్జన్యం చేశారని ఫిర్యాదు

పాల్వంచరూరల్‌: సివిల్‌ దుస్తుల్లో వచ్చిన ఇద్దరు పోలీసులు సోదాల పేరుతో దౌర్జన్యం చేశారని ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మండలంలోని కిన్నెరసానిలోని పెద్దబోయిన వెంకటనర్సమ్మ దుకాణం వద్దకు శుక్రవారం సివిల్‌ దుస్తుల్లో ప్రసాద్‌, నరేశ్‌ వచ్చి.. గంజాయి విక్రయిస్తున్నావంటూ దుర్భాషలాడారు. ఆమె కుమారుడిని తనిఖీ చేశారు. మహిళ అని చూడకుండా తనను బలవంతంగా నేట్టివేశారని శనివారం బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ విషయమై ఎస్‌ఐ సురేశ్‌ను వివరణ కోరగా మహిళ ఫిర్యాదు చేసిన విషయం వాస్తవమేనని, విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని చెప్పారు.

పేకాట స్థావరంపై దాడి

అశ్వాపురం: మండలంలోని మొండికుంట శివారులో సీతారామ ప్రాజెక్ట్‌ కెనాల్‌ ప్రాంతంలో పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేశారు. ఏడుగురిని అదుపులోకి తీసుకొని రూ.19 వేల నగదు, ఐదు సెల్‌ఫోన్లు, మూడు ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు.

కొండచిలువల

సంచారం

బూర్గంపాడు: అశ్వాపురం మండలంలోని మనుబోతులగూడెం ఫారెస్ట్‌ సెక్షన్‌లో కొండచిలువల సంచారం పెరిగింది. 250 ఎకరాల్లో ఇటీవల అటవీశాఖ అధికారులు ప్లాంటేషన్‌ చేపట్టారు. ఫారెస్ట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌ నాగరాజు శనివారం ప్లాంటేషన్‌ నిర్వహణకు వెళ్తున్న క్రమంలో రెండుచోట్ల కొండచిలువలు (ఇండియన్‌ ఫైథాన్‌) కనిపించాయని తెలిపారు. అటవీ సంరక్షణ చర్యలతో కొన్ని జీవజాతులు మళ్లీ అడవుల్లో కనిపిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.

కుక్క, కోతి దాడిలో

నలుగురికి గాయాలు

ముదిగొండ: మండలంలోని న్యూలక్ష్మీపురం, ముదిగొండ, యడవల్లిగ్రామాల్లో శనివారం కుక్క, కోతి చేసిన దాడిలో నలుగురికి గాయాలయ్యాయి. వీధిలో వెళుతున్న నఫీసా, మరో కూలీ పై కుక్క దాడి చేయగా, మరో ఇద్దరిపై కోతులు దాడి చేశాయి. ఈమేరకు గాయపడిన వారికి ముదిగొండ పీహెచ్‌సీలో చికిత్స చేయించారు.

ఆర్టీసీ దుకాణ దారులకు జరిమానా1
1/2

ఆర్టీసీ దుకాణ దారులకు జరిమానా

ఆర్టీసీ దుకాణ దారులకు జరిమానా2
2/2

ఆర్టీసీ దుకాణ దారులకు జరిమానా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement