
కాంగ్రెస్ హయాంలో సుపరిపాలన
● పాల్వంచలో మరో పవర్‌ప్లాంట్ ఏర్పాటు చేస్తాం ● రాజ్యసభ సభ్యురాలు రేణుకాచౌదరి
సూపర్‌బజార్(కొత్తగూడెం)/పాల్వంచ/సుజాతనగర్: రాష్ట్రంలో కాంగ్రెస్ ఆధ్వర్యాన సుపరిపాలన సాగుతోందని రాజ్యసభ సభ్యురాలు రేణుకాచౌదరి తెలిపారు. కొత్తగూడెం క్లబ్‌లో శనివారం జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుతో కలిసి ఆమె కల్యాణలక్ష్మి, షాదీముబారక్, సీఎంఆర్‌ఎఫ్ లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశాక మాట్లాడారు. కాగా, సింగరేణిలో అవకతవకలపై విచారణ చేయిస్తామన్నారు. అనంతరం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ.. 167 మంది కల్యాణలక్ష్మి, షాదీముబారక్, 165 మందికి సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు పంపిణీ చేశామని తెలిపారు. అనంతరం పాల్వంచలో తొలగించిన కేటీపీఎస్ ఓఅండ్‌ఎం (పాత ప్లాంట్) కర్మాగారాన్ని కలెక్టర్ జితీశ్ వి.పాటిల్‌తో కలిసి సందర్శించిన ఎంపీ రేణుకాచౌదరి కేటీపీఎస్ సీఈ శ్రీనివాసబాబు, అధికారులతో మాట్లాడారు. పాల్వంచలో మరో విద్యుత్ కర్మాగారాన్ని నిర్మిస్తామని తెలిపారు. ఎన్‌ఎండీసీ విస్తరణపైనా పరిశీలిస్తున్నామని చెప్పారు. ఎస్‌ఈ యుగపతి, కొత్తగూడెం ఆర్డీఓ మధు, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సుజాత, సొసైటీల చైర్మన్లు మండే వీరహన్మంతరావు, కొత్వాల శ్రీనివాసరావు, నాయకులు నాగా సీతారాములు, ఎస్‌కే సాబీర్‌పాషా, ఎడవల్లి కృష్ణ, మంగీలాల్, జలీల్, మాజిద్ తదితరులు పాల్గొన్నారు. కాగా, సుజాతనగర్‌కు చెందిన దివంగత సీపీఎం నేత కాసాని ఐలయ్య కుటుంబాన్ని ఎంపీ రేణుకాచౌదరి పరామర్శించారు.