
●ఖర్చు పెట్టుకోలేక..
గ్రామీణ ప్రాంతాల్లో రైతులు వరి నారును జీవాల నుంచి కాపాడుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కొందరు నారు చుట్టూ రక్షణగా కంచెలు, పరదాలు, వలలు, గ్రీన్‌షీట్‌లను ఏర్పాటు చేస్తుంటారు. ఇవి కొంతమేర ఖర్చుతో కూడుకున్నవి. కానీ, రూపాయి ఖర్చు లేకుండా అశ్వారావుపేట మండలం మొద్దులమడ గ్రామంలో ఓ గిరిజన రైతు ఇంట్లో వాడి వృథాగా పడేసిన పాత చీరలను కంచెకు కట్టి వరి నారుకు రక్షణగా ఏర్పాటు చేశాడు. ఈ దృశ్యాన్ని శనివారం ‘సాక్షి’కెమెరా క్లిక్ మనిపించింది.
–అశ్వారావుపేటరూరల్