
జామాయిల్ చిగుర్ల చోరీపై విచారణ
ములకలపల్లి: జామాయిల్ మొక్కల చిగుర్ల చోరీపై టీఎస్‌ఎఫ్‌డీసీ అధికారులు విచారణ చేపట్టారు. మండలంలోని జిన్నెలగూడెం ప్లాంటేషన్ పరిధిలోని సుమారు 50 హెక్టార్లలో తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ (టీఎస్‌ఎఫ్‌డీసీ) ఆధ్వర్యంలో పెంచుతున్న జామాయిల్ తోటల్లోని చిగుర్ల చోరీపై శనివారం ‘జామాయిల్ మొక్కల చిగుర్లు చోరీ?’శీర్షికన ‘సాక్షి’లో కథనం ప్రచురితమైన విషయం విదితమే. దీంతో సంబందిత శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ప్లాంటేషన్ మేనేజర్ (పీఎం) సునీత క్షేత్రస్థాయిలో పర్యటించి, వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా ‘సాక్షి’తో మాట్లాడుతూ.. చిగుర్ల చోరీలో తమశాఖ సిబ్బంది ప్రమేయం లేదని తెలిపారు. సమగ్ర విచారణ చేపడుతున్నామని, ఉన్నతాధికారులకు నివేదిక సమర్పిస్తామని వెల్లడించారు.

జామాయిల్ చిగుర్ల చోరీపై విచారణ