
నిబంధనల మేరకు పూర్తి చేయాలి
పాల్వంచరూరల్: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పను లను నిబంధనల ప్రకారం నిర్దేశించిన గడువులోగా పూర్తిచేయాలని హౌజింగ్ పీడీ రవీంద్ర నాథ్ ఆదేశించారు. మండలంలోని తోగ్గూడెం గ్రామంలో శుక్రవారం నిర్మాణంలో ఉన్న ఇళ్ల ను పనిశీలించారు. లబ్ధిదారులకు మాట్లాడా రు. ఇంకా నిర్మాణ పనులను ప్రారంభించని లబ్ధిదారులు వారంలోగా ప్రారంభించాలని సూచించారు. నిర్దేశించిన గడువులో ఇళ్ల నిర్మా ణ పనులు పూర్తి చేయాలని చెప్పారు. కార్యక్రమంలో ఎంపీడీఓ కె.విజయభాస్కర్‌రెడ్డి, హౌ జింగ్ ఏఈ విశ్వేశ్వరరావు, కార్యదర్శి రవికుమార్ పాల్గొన్నారు.
అభివృద్ధి పనుల పరిశీలన
అన్నపురెడ్డిపల్లి(చండ్రుగొండ): మండలంలోని వివిధ గ్రామాల్లో అభివృద్ధి పనులను జిల్లా పరిషత్ సీఈఓ బి.నాగలక్ష్మి శుక్రవారం పరిశీలించారు. వెంకటేశ్వరస్వామి ఆలయంలో నిర్మాణ దశలో ఉన్న కమ్యూనిటీ శానిటరి కాంప్లెక్స్, రామకృష్ణాపురంలో మునగసాగు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు. అబ్బుగూడె, మర్రిగూడెంలో ఇంకుడుగుంతల నిర్మాణాలు, సైడ్ డ్రెయిన్ పనులకు భూమిపూజ చేశారు. తొలుత ఎంపీడీఓ కార్యాలయంలో వివిధ శాఖాధికారులతో సమీక్ష నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ కావూరి మహాలక్ష్మితోపాటు వివిధ శాఖాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
కూసుమంచి ఏడీఏ
సరితకు పదోన్నతి
భద్రాద్రి జిల్లా ఆత్మ డీపీడీగా నియామకం
ఖమ్మంవ్యవసాయం/కూసుమంచి: కూసుమంచి వ్యవసాయ డివిజన్ అసిస్టెంట్ డైరెక్టర్ (ఏడీ ఏ) బి.సరితకు డిప్యూటీ డైరెక్టర్‌గా పదోన్నతి లభించింది. ఈ మేరకు ఆమెను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆత్మ డిప్యూటీ ప్రాజెక్ట్ డైరెక్టర్ (డీపీడీ)గా నియ మిస్తూ గురువారం రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి ఎం.రఘునందన్‌రావు ఉత్తర్వులు జారీ చేశా రు. దీంతో శుక్రవారం సరిత విధుల నుంచి రిలీవ్ అయి భద్రాద్రి జిల్లాలో బాధ్యతలు స్వీకరించారు. ఇదే సమయాన ఖమ్మం రైతు శిక్షణ కేంద్రం ఏడీఏ ఎం.సతీశ్‌కు కూసుమంచి ఏడీఏ గా అదనపు బాధ్యతలు అప్పగించారు. కాగా, సరిత సుదీర్ఘకాలం ఖమ్మం జిల్లా వ్యవసాయ శాఖ కార్యాలయంలో టెక్నికల్ ఏడీఏగా, ఇన్‌చార్జ్ జిల్లా వ్యవసాయాధికారిగా విధులు నిర్వర్తించారు.
ఓసీ విస్తరణకు ప్రజామోదం
మణుగూరుటౌన్: సింగరేణి కాలరీస్ మణుగూ రు ఓసీ విస్తరణలో భాగంగా శుక్రవారం గ్రామసభలో తిర్లాపురం గ్రామస్తులు చేతులు ఎత్తి సుముఖత వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సుమ తిర్లాపురం రైతువేదికలో గ్రామసభ నిర్వహించారు. భూ సేకరణలో ఎకరాకు రూ.22.5 లక్షలు, ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ, చెరువులపై ఆధారపడిన మత్స్యకారులు పొలా లు పోని వారికి ఆర్‌అండ్‌ఆర్ అందిస్తామని, ని ర్వాసితులకు సింగరేణిలో ఔట్ సోర్సింగ్ ఉద్యో గం కల్పిస్తామని తెలిపారు. దీంతో గ్రామస్తులు ఆమోదం తెలుపుతూ చేతులు ఎత్తారు. సమావేశంలో తహసీల్దార్ అద్దంకి నరేశ్, జీఎం దుర్గం రాంచందర్, ఎంపీడీఓ శ్రీనివాసరావు, సింగరేణి అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
రేపు రాష్ట్ర స్థాయి సదస్సు
ఖమ్మం స్పోర్ట్స్: ఖమ్మంలో ఈనెల 13న రాష్ట్రస్థాయి యోగా సదస్సు నిర్వహిస్తున్నట్లు సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు మరికంటి వెంకట్ తెలిపారు. ఖమ్మంలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ కవిత మెమోరియల్ డిగ్రీ కళాశాలలో ఆదివారం జరిగే ఈ సదస్సుకు 200 మంది ప్రతినిధులు హాజరవుతారని వెల్లడించారు. ఈ సందర్భంగా కేజీ నుంచి పీజీ వరకు యోగా విద్యను పాఠ్యాంశంగా ప్రవేశపెట్టాలని తీర్మానించనున్నామని తెలిపారు.

నిబంధనల మేరకు పూర్తి చేయాలి

నిబంధనల మేరకు పూర్తి చేయాలి

నిబంధనల మేరకు పూర్తి చేయాలి