
జామాయిల్ మొక్కల చిగుర్లు చోరీ?
ములకలపల్లి: జామాయిల్ మొక్కల లేలేత చిగుర్లు చోరీకి గురవుతున్నాయి. మొక్కల పునరుత్పత్తి చేసే చాంబర్లలో వీటికి భారీగా డిమాండ్ ఉండడంలో తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ (టీఎస్‌ఎఫ్‌డీసీ) ఆధ్వర్యంలో పెంచుతున్న జామాయిల్ తోటల్లోని చిగుర్లు అక్రమార్కుల పాలవుతున్నాయి. స్థానిక సిబ్బంది సహకారంతోనే ఈ దందా సాగుతున్నట్లు ప్రచారం సాగుతోంది. మండంలోని జిన్నెలగూడెం ప్లాంటేషన్ పరిధిలో సుమారు 50 హెక్లార్లలోని జామాయిల్ తోటలను రెండు నెలల కిందట నరికేశారు, విస్తారంగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ఈ ప్రదేశంలో జామాయిల్ మొక్కలు లేలేత చిగుర్లతో పెరుగుతున్నాయి. చిగుర్ల ద్వారా జామాయిల్ మొక్కల పునరుత్పత్తి చేపట్టనున్న తరుణంలో జామాయిల్ చాంబర్లలో వీటికి భారీగా డిమాండ్ ఏర్పడింది. దీంతో పలువురు ఇక్కడి చిగుర్లపై దృష్టి సారించారు. చిగుర్లను చోరీ చేసి వాహనాల్లో చాంబర్లకు తరలిస్తున్నారు. జిన్నెలగూడెం ప్లాంటేషన్ పరిధిలో సిబ్బంది సహకారంతో కొంతకాలంగా ఈ దందా సాగుతున్నట్లు తెలిసింది. ఈ విషయమై ప్లాంటేషన్ మేనేజర్ సునీతను వివరణ కోరగా.. క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి, చర్యలు తీసుకుంటామని తెలిపారు.

జామాయిల్ మొక్కల చిగుర్లు చోరీ?