
మంత్రిని కలవకుండా మహిళల అరెస్ట్
కొత్తగూడెంటౌన్: మంత్రిని కలవకుండా తొమ్మిది మంది మహిళలను టూటౌన్ పోలీసులు ఆదివారం ముందస్తుగా అరెస్ట్ చేశారు. మాయాబజార్, రుద్రంపూర్‌లకు చెందిన తొమ్మిది మంది పల్లపు కొమరమ్మ, బండారి లీలావతి, గుంజా నాగమణి, కల్లూరి రేణుకా, ఓర్పు, అనుషా, ఓర్పు రాజేశ్వరి, పల్లపు శారద, బండా ప్రవళిక, పల్లపు శైలజాతోపాటు ఓర్పు వెంకన్న, పల్లపు రాజేష్‌లు మాట్లాడుతూ తమకు ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని చెప్పి, ఇవ్వలేదని పేర్కొన్నారు. కొత్తగూడెం క్లబ్‌లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కలిసి ఈ సమస్య చెప్పుకుందామంటే సీఐ అరెస్ట్ చేసి, వెళ్లకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. కాగా మంత్రి పర్యటన ముగిశాక పోలీసులు వారిని వదిలిపెట్టారు.