
కిష్టారంలో ‘చావు’ కష్టాలు
టేకులపల్లి: మండల పరిధిలోని కిష్టారం గ్రామంలో అంతిమ సంస్కారాలకు తిప్పలు తప్పడంలేదు. గ్రామానికి చెందిన కొర్స నర్సయ్య బుధవారం మృతి చెందాడు. శ్మశాన వాటిక ముర్రేడు వాగు అవతల వైపు ఉంది. దీంతో గురువారం దహనసంస్కారాలు చేసేందుకు వాగు దాటి వెళ్లేందుకు అష్టకష్టాలు పడ్డారు. సుమారు రెండు వేల ఎకరాల వ్యవసాయ భూములు కూడా అటువైపే ఉన్నాయి. చిన్న వర్షానికి కూడా వాగు ఉధృతంగా ప్రవహించి రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. హైలెవెల్ బ్రిడ్జి నిర్మించాలని 40 ఏళ్లుగా అధికారులకు, ప్రజాప్రతినిదులకు పలుమార్లు విన్నవించినా సమస్య పరిష్కారానికి నోచుకోలేదు. ఇప్పటికై నా ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య చొరవ తీసుకుని బ్రిడ్జి నిర్మాణానికి కృషి చేయాలని రైతులు, గ్రామ పెద్దలు చింత జోగయ్య, జబ్బ జోగయ్య, పాయం లక్ష్మినర్సు, బొల్లి కృష్ణ, చింత రాంబాబు, వేప లక్ష్మయ్య, చింత నాగేశ్వరరావు, కంగలభద్రయ్య, చింత సంపత్, ఏపె పగడయ్య కోరారు.
అంతిమ సంస్కారాలకు వర్షాకాలంలో వాగు దాటేందుకు అవస్థలు