
బొగ్గు ఉత్పత్తి, ఉత్పాదకతపై ఆరా
ఇల్లెందు/టేకులపల్లి: సింగరేణి డైరెక్టర్(పా) గౌతమ్ పొట్రు శనివారం సింగరేణి ఇల్లెందు ఏరియాలో పర్యటించి పలు ప్రదేశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా జేకే ఓసీ, సీహెచ్‌పీని సందర్శించి అక్కడి వ్యూ పాయింట్ నుంచి బొగ్గు ఉత్తత్తి, ఉత్పాదకతతో పాటు జేకే ఓసీ కాల పరిమితి, సీహెచ్‌పీలోని లోడింగ్, బొగ్గు గ్రేడింగ్ పని తీరును ఏరియా జీఎం వీసం కృష్ణయ్యను అడిగి తెలుసుకున్నారు. అలాగే పూసపల్లి ఓసీ ఏర్పాటు తీరును తెలుసుకున్నాక రికార్డులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఓటూ జీఎం జాకీర్ హుస్సేన్, డీజీఎం పర్సనల్ తుకారం, అధికారులు పాల్గొన్నారు. అలాగే కోయగూడెం ఓపెన్‌కాస్టును సందర్శించి కేఓసీ వ్యూ పాయింట్ ద్వారా బొగ్గు ఉత్పత్తి, రవాణా, ఓబీ బ్లాస్టింగ్, లోడింగ్ పనులపై ఆరా తీసి రక్షణతో కూడిన బొగ్గు ఉత్పత్తి చేయాలన్నారు. అనంతరం కేఓసీలో మొక్క నాటారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఓటు జీఎం జాకీర్ హుస్సేన్, కోయగూడెం పీఓ గోవిందరావు, డీజీఎం పర్సనల్ అజ్మీర తుకారం, ఇల్లెందు ఏరియా ఇతర అధికారులు పాల్గొన్నారు.