ఖుర్షీద్ సేవలు అభినందనీయం
చుంచుపల్లి: జిల్లా సహకార శాఖ అధికారిగా సుదీర్ఘకాలం పనిచేసిన సయ్యద్ ఖుర్షీద్ సేవలు ఎనలేనివని అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్ అన్నారు. డీసీఓ ఉద్యోగ విరమణ సందర్భంగా కలెక్టరేట్‌లో శనివారం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. విధుల్లో చేరిన నాటి నుంచి సహకార రంగ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేశారని అన్నారు. తోటి సిబ్బందితో స్నేహంగా ఉంటూనే క్రమశిక్షణతో విధులు నిర్వహించేలా పర్యవేక్షించారని చెప్పారు. ఉద్యోగ విరమణ పొందిన ఖుర్షీద్ శేషజీవితం సజావుగా సాగాలని, ఆయురాగ్యాతో జీవించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో మార్క్‌ఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల శ్రీనివాసరావు, టీఎన్జీవోస్ అధ్యక్షులు అమరనేని రామారావు, టీజీఓస్ జిల్లా అధ్యక్షుడు సంగం వెంకటపుల్లయ్య, ఇన్‌చార్జ్ డీసీఓ శ్రీనివాస్, కవి, సామాజికవేత్త కోమాకుల సీతారాములు, మద్దెర్ల రమేష్, సహకార శాఖ చైర్మన్‌లు, ఖుర్షీద్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
అదనపు కలెక్టర్ వేణుగోపాల్


