
ఆయిల్‌పామ్ సాగుతో లాభాలు
టేకులపల్లి : పామాయిల్ సాగుతో అనేక లాభాలు ఉన్నాయని ఉద్యాన శాఖ జిల్లా అధికారి జె.కిశోర్‌కుమార్, వ్యవసాయ శాఖ ఏడీఏ జి.లాల్‌చంద్ అన్నారు. మండలంలోని చింతోనిచెలకలో ఉద్యాన, వ్యవసాయ శాఖల ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో వారు మాట్లాడారు. ఎకరానికి 57 పామాయిల్ మొక్కలు వేయాలని, డ్రిప్ పరికరాల కోసం ఎస్సీ, ఎస్టీ రైతులకు 100 శాతం, బీసీ రైతులకు 90 శాతం, ఓసీ రైతులకు 80 శాతం సబ్సిడీతో రుణాలు అందిస్తామని చెప్పారు. మూడేళ్లపాటు ఎకరానికి రూ.4200 చొప్పున రైతుల ఖాతాలల్ల జమ చేస్తామన్నారు. పామాయిల్ గెలలు 30 సంవత్సరాల వరకు దిగుబడి వస్తాయని, నికర ఆదాయం ఉంటుందని వివరించారు. పామాయిల్‌లో అంతర పంటగా మునగ సాగు చేయాలని కోరారు. కార్యక్రమంలో ఏఓ అన్నపూర్ణ, హెచ్‌ఓ స్రవంతి, ఏఈఓ రెహనా, ఇరిగేషన్ మేనేజర్ జైన్ తదితరులు పాల్గొన్నారు.
ఉద్యాన శాఖాధికారి కిశోర్‌కుమార్