
నిందితుడికి రిమాండ్
పాల్వంచ: వివాహిత ఆత్మహత్య కేసులో నిందితుడు, టీఎస్‌పీఎస్ కానిస్టేబుల్ నాగరాజును పోలీసులు బుధవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసుల కథనం ప్రకారం.. సుజాతనగర్ మండల కేంద్రానికి చెందిన బత్తుల వీరయ్య భార్య త్రివేణి(32)ని మరిది కానిస్టేబుల్ నాగరాజు వేధింపులకు గురిచేయడంతో తీవ్ర మనస్తాపం చెందింది. పాల్వంచలోని వికలాంగుల కాలనీలో నివాసం ఉంటున్న తండ్రి శివ ఇంటికి వచ్చి సోమవారం చీరతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు త్రివేణి ఆత్మహత్యకు కారణమైన మరిదిని అరెస్ట్ చేశారు.
పశువులు స్వాధీనం
టేకులపల్లి: టేకులపల్లి నుంచి పండితాపురం సంతకు అక్రమంగా తరలిస్తున్న పశువులను బుధవారం టేకులపల్లి పోలీసులు పట్టుకున్నారు. తావుర్యాతండా పంచాయతీ ఈర్యాతండా వద్ద వాహన తనిఖీలు చేపట్టిన పోలీసులు బొలెరో ట్రాలీలో తరలిస్తున్న ఏడు పశువులను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు మునీర్, తేజవత్ ప్రసాద్, హైమద్‌లను అరెస్టు చేసి, కేసు నమోదు చేశారు. పశువులను పాల్వంచ గోశాలకు తరలించామని ఎస్‌ఐ రాజేందర్ తెలిపారు.