
తారుప్లాంట్‌లో అగ్నిప్రమాదం
బూర్గంపాడు: మండల పరిధిలోని మోరంపల్లిబంజర గ్రామంలో ఉన్న తారుప్లాంట్‌లో బుధవారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. తారు ప్లాంట్ నుంచి దట్టమైన పొగతో మంటలు వ్యాపించటంతో ఆ ప్రాంతమంతా చీకటిగా మారింది. జాతీయ రహదారిపై వెళ్తున్న వాహనాల రాకపోకలకు కూడా అంతరాయం కలిగింది. ప్లాంట్‌లో పనిచేసే కార్మికుల సమాచారంతో భద్రాచలం నుంచి వచ్చిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఈ ఘటనలో రూ.10 లక్షల ఆస్తినష్టం జరిగినట్లు సమాచారం. భద్రాచలం ఫైర్ ఆఫీసర్ శ్రీనివాస్, ఫైర్‌మెన్లు కిరణ్, యాకుబ్, వెంకట్రామిరెడ్డి మంటలను ఆర్పేందుకు కృషి చేశారు. అగ్నిప్రమాదానికి గల కారణాలపై అధికారులు విచారణ జరుపుతున్నారు.