
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
జూలూరుపాడు: మండలంలోని గుండెపుడి ఆర్కే ఫంక్షన్ హాల్ వద్ద మంగళవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఎస్‌ఐ బాదావత్ రవి కథనం ప్రకారం.. గుండెపుడి గ్రామ పంచాయతీ రామచంద్రాపురం గ్రామానికి చెందిన పద్దం చిన్న నరసింహారావు(35), కల్తి కార్తీక్‌లు బైక్‌పై మంగళవారం రాత్రి జూలూరుపాడు వచ్చారు. పని ముగించుకుని తిరిగి వెళ్తుండగా గుండెపుడి ఆర్కే ఫంక్షన్ హాల్ సమీపంలో రోడ్డుపై అడ్డుగా వచ్చిన గేదెలను బైక్ ఢీకొట్టింది. దీంతో పద్దం చిన్న నరసింహారావు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. కార్తీక్‌కు గాయాలయ్యాయి. బుధవారం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
గుండెపోటుతో ఎస్‌అండ్‌పీ గార్డు..
ఇల్లెందు: పట్టణంలోని స్ట్రట్‌ఫిట్ బస్తీకి చెందిన సింగరేణి సెక్యూరిటీ గార్డు బి.రాజ్‌కుమార్(40) బుధవారం గుండె పోటుతో మృతిచెందాడు. ఉదయం విధుల నిమిత్తం ఆఫీస్‌కు వెళ్లిన ఆయనకు చెమటలు వచ్చి అస్వస్థత చెందడంతో సింగరేణి ఆస్పత్రికి వెళ్లాలని తోటి సిబ్బంది సూచించారు. ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్తానని చెప్పి ఇంటికి వెళ్లాడు. ఇంటికి చేరిన కొద్ది సమయానికే మృతి చెందా డు. సహచర గార్డులు, సింగరేణి కార్మిక సంఘాల నాయకులు మృతదేహాన్ని సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
కర్ణాటకలో చోరీ..
వైరాలో రికవరీ
వైరా: కర్ణాటక రాష్ట్రంలో జరిగిన చోరీకి సంబంధించి నిందితుడు వైరాలో పట్టుబడగా సొత్తు రికవరీ చేసి అక్కడి పోలీసులకు అప్పగించారు. ఈఏడాది ఫిబ్రవరి 12వ తేదీన వైరా లీలా సుందరయ్యనగర్‌లోని ఓ ఇంట్లో చోరీ జరిగింది. ఇక్కడ దొంగతనం చేసిన వారే అదే నెల 22 తేదీన కర్ణాటక రాష్ట్రంలోని చల్లెకిరే పోలీస్ స్టేషన్ పరిధిలోనూ చోరీకి పాల్పడ్డారు. ఈమేరకు వైరా సీఐ నూనావత్ సాగర్‌నాయక్ ఆధ్వర్యాన చేపట్టిన విచారణలో నిందితులు పట్టుబడగా వారి నుంచి బంగారాన్ని రికవరీ చేశారు. అందులో కర్ణాటకలో నమోదైన కేసుకు సంబంధించి 12తులాల బంగారు ఆభరణాలు, కారును చొల్లకిలే ఏఎస్‌ఐ రవికుమార్, హెడ్ కానిస్టేబుల్ వసంత్‌కుమార్‌కు వైరాలో సీఐ సాగర్ బుధవారం అందజేశారు.

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి