
ఈతకు వెళ్లిన బాలుడికి షాక్
ఆస్పత్రికి తరలించేలోగా మృతి
కొత్తగూడెంఅర్బన్: లక్ష్మీదేవిపల్లి మండలం అశోక్‌నగర్ వద్ద మొర్రేడు వాగులో ఈతకు వెళ్లిన బాలుడు.. అక్కడే మోటార్‌కు అమర్చిన విద్యుత్‌వైరు తాకి.. షాక్‌కు గురై మృతి చెందాడు. ఈ ఘటన సోమవారం చోటుచేసుకుంది. కొత్తగూడెం మున్సిపాలిటీ న్యూగొల్లగూడెంనకు చెందిన టిల్లు (15) తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. వేసవి సెలవులు కావడంతో మొర్రేడువాగులో ఈతకు వెళ్లాడు. వాగులో మోటారుకు అమర్చిన విద్యుత్ తీగ షాక్ కొట్టడంతో స్పృహ కోల్పోయాడు. గమనించిన స్థానికులు టిల్లును కొత్తగూడెం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. టిల్లు మృతదేహాన్ని సీపీఐ జిల్లా కార్యదర్శి సాబీర్‌పాషా సందర్శించారు.
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
అశ్వాపురం: మండలంలోని బీజీకొత్తూరు వద్ద ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంపై సోమవారం పోలీసులు కేసు నమోదు చేశారు. బూర్గంపాడు మండలం బుడ్డగూడెం గ్రామానికి చెందిన సోడె శ్రీకాంత్ (26) బైక్‌పై మణుగూరు మండలం పగిడేరులో పెళ్లికి వెళ్లి తిరిగి వస్తున్నాడు. బీజీ కొత్తూరు వద్ద ధాన్యం కొనుగోలు కేంద్రం నుంచి ట్రాక్టర్ రోడ్డుపైకి వస్తూ బైక్‌ను ఢీకొనడంతో శ్రీకాంత్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఆస్పత్రికి 108లో తరలిస్తుండగా మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ మధుప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.