
గిరిజనుల సమస్యల పరిష్కారానికి కృషి
భద్రాచలంటౌన్: గిరిజన, ఆదివాసీల సమస్యలు పరిష్కరించడమే కాక అర్హులకు ప్రభుత్వ పథకాలు అందేలా కృషి చేస్తామని ఐటీడీఏ పీఓ బి.రాహుల్ తెలిపారు. భద్రాచలం ఐటీడీఏ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గిరిజన దర్బార్‌లో ఆయన దరఖాస్తులు, వినతిపత్రాలు స్వీకరించాక మాట్లాడారు. పోడు భూముల, వ్యక్తిగత, భూ సమస్యలు, స్వయం ఉపాధి పథకాలు, పట్టా భూములకు రైతుబంధు, జీవనోపాధి పెంపొందించుకోవడానికి ఆర్థిక సాయం, ట్రైకార్ రుణాలు, గిరి వికాసం ద్వారా సోలార్ విద్యుత్ కనెక్షన్లు తదితర అంశాలపై వినతులు రాగా పరిష్కారంపై ఉద్యోగులకు పీఓ సూచనలు చేశారు. కార్యక్రమంలో ఏపీఓ డేవిడ్‌రాజ్, డీడీ మణెమ్మ, ఆర్‌సీఓ అరుణకుమారి, వివిధ విభాగాల ఉద్యోగులు రవీంద్రనాథ్, భాస్కరన్, వేణు, లక్ష్మీనారాయణ, మనిధర్, ఉదయ్‌కుమార్, సమ్మయ్య, ఆదినారాయణ, నారాయణరావు, చైతన్య, హరికృష్ణ పాల్గొన్నారు.
ఐటీడీఏ పీఓ రాహుల్