
సింగరేణి రెస్క్యూ స్టేషన్‌లో ఎస్పీ
సింగరేణి(కొత్తగూడెం): సింగరేణి కొత్తగూడెం ఏరియా 4 ఇంక్‌లైన్‌లోని రెస్క్యూ స్టేషన్‌ను ఎస్పీ రోహిత్‌రాజు సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఉద్యోగులు రెస్క్యూ ఆపరేషన్లలో విని యోగించే పరికరాలు, తీసుకునే జాగ్రత్తలు, ఇప్పటివరకు చేసిన ఆపరేషన్ల వివరాలను ఇన్‌చార్జ్ అనంతరామయ్య వివరించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ క్లిష్ట పరిస్థితుల్లో సింగరేని ఉద్యోగులు చేపట్టే రెస్క్యూ ఆపరేషన్లు పలువురి ప్రాణాలను నిలబెడుతున్నాయని అభినందించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ రహమాన్, సీఐలు రమేష్‌కుమార్, చెన్నూరు శ్రీనివాస్, సింగరేణి అధికారులు కోటిరెడ్డి, తావురియా, అభిలాష్ తదితరులు పాల్గొన్నారు. డీఎస్పీ రెహమాన్‌తో పాటు వివిధ విభాగాల ఉద్యోగులు చెన్నూరు శ్రీనివాస్, కోటిరెడ్డి, తావురియా, అభిలాష్ తదితరులు పాల్గొన్నారు.