
‘సీతారామ’ పనుల్లో భారీగా అవినీతి
ములకలపల్లి: సీతారామ ప్రాజెక్ట్ నిర్మాణ పనుల్లో అవినీతి వరద ప్రవహిస్తోందని బీజేపీ జిల్లా అద్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. మండల పరిధిలోని 48.30 కి.మీ. వద్ద ప్రధాన కాలువపై సూపర్ పాసేజ్ పిల్లర్ కూలిన ప్రదేశాన్ని శనివారం బీజేపీ నాయకులు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుమారు రూ.20వేల కోట్లతో నిర్మించిన ప్రాజెక్ట్ ట్రయల్ రన్‌కే పిల్లర్ కూలిపోవడం పనుల్లోని డొల్లతనాన్ని తేటతెల్లం చేస్తున్నాయని అన్నారు. ప్రధాన కాలువ గైడ్‌వాల్‌కు పలుచోట్ల బీటలువారడం, లైనింగ్ విరిగిపోయి ప్రధాన కాలువ తెగిపోవడం అఽధికారుల ఉదాసీన త, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యానికి పరాకాష్ట అని అన్నారు. సమగ్ర విచారణ చేపట్టి అధికారులు, కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పార్టీ ములకలపల్లి, అన్నపురెడ్డిపల్లి మండలాల అధ్యక్షులు గుగులోత్ శంకర్‌నాయక్, జుబ్బూరి రమేశ్, తంగెళ్ల ఆంజనేయులు, బాణోత్ మల్లేశ్, బాణోతు సుధారాణి, తేజావత్ పార్వతి, సూర్యం, రవికుమార్, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలి
అన్నపురెడ్డిపల్లి (చండ్రుగొండ): అకాల వర్షాలతో కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్‌రెడ్డి డిమాండ్ చేశారు. మండలంలోని మర్రిగూడెం, అబ్బుగూడెం గ్రామాల్లో శనివారం ఆయన ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ధాన్యం కాంటాలు అయినా ఎగుమతి లేక, లారీలు రాక రైతులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ నాయకులు క్షేత్రస్థాయిలో పరిస్థితి చూడాలని పేర్కొన్నారు. ఇటీవల ధాన్యం కొనుగోలు కేంద్రంలో విద్యుదాఘాతానికి గురై మృతి చెందిన మామిడి రెమల్య కుంటుంబాన్ని పరామర్శించారు. ఈ కార్యక్రమంలో జుబ్బురి రమేష్, దేవిబాల కిరణ్‌శర్మ, జటంగి కృష్ణ, మొగిలి రామకృష్ణ, శ్రీను పాల్గొన్నారు.
బీజేపీ జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్‌రెడ్డి