
బొట్టూబొట్టు ఒడిసిపట్టేలా..
సూపర్‌బజార్(కొత్తగూడెం): రాబోయే వర్షాకాలంలో ప్రతీ నీటిబొట్టును ఒడిసిపట్టేలా ఇంకుడు గుంతలు, ఫామ్‌పాండ్స్ నిర్మాణానికి అధికారులు సమాయత్తమవుతున్నారు. భూగర్భ జలాల పెంపునకు కృషి చేస్తున్నారు. అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు కార్యాచరణ ప్రారంభించారు. ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు, హాస్టళ్లలో కచ్చితంగా ఇంకుడు గుంతల నిర్మాణాలు చేపట్టాలని, ఇంటి నిర్మాణాలకు అనుమతి ఇచ్చేముందు ఇంకుడు గుంతల నిర్మాణాలు తప్పనిసరి చేయాలని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ ఆదేశించారు. జిల్లాలోని వివిధ మండలాల్లో పర్యటిస్తూ ఇంకుడుగుంతల ప్రాధాన్యతను వివరిస్తూ అవగాహన కల్పిస్తున్నారు. అధికారుల సమష్టి కృషితో నిర్వహిస్తున్న భగీరథ ప్రయత్నాలు దేశంలోనే జిల్లా ప్రథమస్థానంలో నిలచేలా పరుగులు పెడుతోంది.
వ్యవసాయ శాఖ లక్ష్యం 34,629 ఫామ్‌పాండ్స్
సాగు భూముల్లో ప్రతి పదెకరాలకు ఒక ఫామ్‌పాండ్ చొప్పున జిల్లావ్యాప్తంగా 34,629 ఫామ్‌పాండ్స్ నిర్మించాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఇప్పటికే 600 ఫామ్‌పాండ్స్ నిర్మాణాలకు మార్కింగ్‌ను కూడా పూర్తి చేశారు. ఒకవైపు ఇంకుడు గుంతలు, మరోవైపు ఫామ్‌పాండ్స్ నిర్మాణాలు జిల్లాలో ఊపందుకోనున్నాయి. కలెక్టర్ స్వయంగా పలుగు, పార పట్టి నిర్మాణ పనులు ప్రోత్సహిస్తున్నారు. తాజాగా ఎస్పీ రోహిత్‌రాజు కూడా పోలీస్ అధికారులతో సమావేశం నిర్వహించి ప్రతీ పోలీస్‌స్టేషన్‌లో, పోలీస్ కార్యాలయాలలో ఇంకుడుగుంతలు నిర్మించాలని ఆదేశాలు జారీచేశారు.
జిల్లాలో భూగర్భ జలాల పెంపునకు భగీరథ ప్రయత్నం
ఇంకుడు గుంతలు, ఫామ్ పాండ్స్ నిర్మాణాలకు కార్యాచరణ
కలెక్టర్ చొరవతో సమష్టిగా
కృషి చేస్తున్న అధికారులు
వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో ఇప్పటికే ప్రారంభం
‘ఉపాధి’లో నీటి కుంటలు..
పాల్వంచరూరల్: ఉపాధి హామీ పథకం ద్వారా ప్రభుత్వం ఉచితంగా నీటి కుంటలను నిర్మిస్తుందని మండల వ్యవసాయాధికారి శంకర్ అన్నారు. మండల పరిధిలోని రాజాపురంలో ఓ రైతు నిర్మిస్తున్న నీటికుంటను శుక్రవారం ఆయన పరిశీలించి మాట్లాడారు. రైతులు తమ పంట పొలాల్లో నీటి కుంటలు నిర్మించుకోవాలని అన్నారు. 15 మీటర్ల పొడవు, 20 మీటర్ల వెడల్పుతో నిర్మాణం చేపట్టాలని సూచించారు. నీటి ఎద్దడి వచ్చినప్పుడు కుంటలోని నీరు పంటలకు ఉపయోగపడుతుందని, చేపలను పెంచుకునే అవకాశం కూడా ఉంటుందని వివరించారు.

బొట్టూబొట్టు ఒడిసిపట్టేలా..

బొట్టూబొట్టు ఒడిసిపట్టేలా..