తీరని వేతన వెతలు | - | Sakshi
Sakshi News home page

తీరని వేతన వెతలు

May 17 2025 6:28 AM | Updated on May 17 2025 6:28 AM

తీరని

తీరని వేతన వెతలు

● విద్యుత్‌ మీటర్‌ రీడింగ్‌ కార్మికులకు అరకొర జీతాలు ● ఏళ్ల తరబడి పనిచేస్తున్నా వేతనాలు పెంచని ప్రభుత్వం ● ఉమ్మడి జిల్లాలో 230 మంది స్పాట్‌ బిల్లింగ్‌ కార్మికులు

ఇల్లెందు: విద్యుత్‌ శాఖలోని మీటర్‌ రీడింగ్‌ కార్మికులు(స్పాట్‌ బిల్లర్‌) అరకొర వేతనాలతో అవస్థలు పడుతున్నారు. వచ్చే వేతనమే తక్కువగా ఉంటే అది కూడా రెండు, మూడు నెలలోకోసారి ఇస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 2 వేలమందికి పైగా, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 230 మంది మీటర్‌ రీడింగ్‌ కార్మికులు పని చేస్తున్నారు. పట్టణాల్లో ఇద్దరు, ముగ్గురు, మండలానికి ఒక్కరు చొప్పున ఉన్నారు. వీరంతా ప్రతీ నెలా 1వ తేదీ నుంచి 12వ తేదీ లోపు మీటర్‌ రీడింగ్‌ తీసి బిల్లులు ఇస్తారు. ఇందుకోసం ఒక్కో విద్యుత్‌ కనెక్షన్‌కు రూ. 3.85 కమీషన్‌ ఇస్తున్నారు. ఒక్కొక్కరికి కనీసంగా 3 వేల కనెక్షన్లు కేటాయిస్తున్నారు. స్పాట్‌ బిల్లింగ్‌ కార్మికులు కేటగిరీ–1 మీటర్‌ రీడింగ్‌ తీస్తుండగా విద్యుత్‌ సంస్థ ఉద్యోగులు కేటగిరీ–2 నుంచి కేటగిరీ–10 వరకు రీడింగ్‌ తీస్తున్నారు. స్పాట్‌బిల్లింగ్‌ కార్మికులు భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా 2,42,705 మీటర్‌ల నుంచి రీడింగ్‌ తీసి బిల్లులు జారీ చేస్తున్నారు.

పనికి తగిన ప్రతిఫలం అందక..

స్పాట్‌ బిల్లింగ్‌ కార్మికులకు శ్రమకు తగిన ప్రతిఫలం అందడంలేదు. నెల మొత్తం కష్టపడితే రూ.16 వేల వరకు వచ్చే అవకాశం ఉంది. ఏళ్ల తరబడి పనిచేస్తున్నా వేతనాలు పెరగడంలేదు. కమీషన్‌ పద్ధతిలో కాకుండా కన్సల్టెన్సీ పద్ధతిలో వేతనం ఇవ్వాలని, లేకపోతే ఆర్టిజన్లుగా గుర్తించాలని స్పాట్‌ బిల్లర్లు కోరుతున్నారు. ప్రతీ నెల 30 పని దినాలు, ఈపీఎఫ్‌, ఈఎస్‌ఐ సదుపాయం, ఉద్యోగ భద్రత కల్పించాలని, సబ్‌ స్టేషన్‌లో ఆపరేటర్‌ పోస్టుల్లోకి తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. అనేక ఏళ్లుగా సమ్మెలు, ఆందోళనలు చేస్తున్నారు. నాలుగు రోజుల క్రితం ఖమ్మంలో ఎమ్మెల్సీ కోదండరాంను సైతం కలిసి వినతి పత్రం అందజేశారు.

కార్మికులను ఆదుకోవాలి

15 ఏళ్లుగా పని చేస్తున్న స్పాట్‌ బిల్లింగ్‌ కార్మికులను విద్యుత్‌ సంస్థ, ప్రభుత్వం ఆదుకోవాలి. ప్రతీ నెలా వేతనం అందేలా చూడాలి. ఆర్టిజన్లుగా గుర్తించాలి. కనీసం నెలకు రూ. 20 వేలు వేతనం చెల్లించాలి.

– కిరణ్‌, స్పాట్‌ బిల్లింగ్‌ కార్మికుడు, ఇల్లెందు

ప్రభుత్వం చొరవ చూపాలి

స్పాట్‌ బిల్లింగ్‌ కార్మికులు చాలీచాలని వేతనాలతో పనిచేస్తున్నారు. సమ్మె చేస్తే ప్రభుత్వం సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇస్తోంది. ఆ తర్వాత పట్టించుకోవడంలేదు. శాశ్వత పరిష్కారం చూపాలి. –గుమ్మడి వెంకటేశ్వర్లు,

స్పాట్‌ బిల్లింగ్‌ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు

తీరని వేతన వెతలు1
1/2

తీరని వేతన వెతలు

తీరని వేతన వెతలు2
2/2

తీరని వేతన వెతలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement