
ఆదివాసీల అభివృద్ధికి తోడ్పాటునందించాలి
చండ్రుగొండ : ఆదివాసీలు చేపట్టిన బ్యాంబో క్లస్టర్ అభివృద్ధికి తోడ్పాటు అందించాలని బ్యాంబో ఇండస్ట్రీస్ ఫౌండేషన్ (బెంగళూరు) సీఈఓ నేజుజార్జ్ ను కలెక్టర్ జితేష్ వి.పాటిల్ కోరారు. మండలంలోని బెండాలపాడు గ్రామశివారులోని బ్యాంబో క్లస్టర్‌ను శుక్రవారం కలెక్టర్, బెంగళూరు బృందంతో కలిసి సందర్శించారు. వెదురుతో చేస్తున్న ఉత్పత్తులను వారికి చూపించి, క్లస్టర్ అభివృద్ధికి కావాల్సిన సదుపాయాలు, తదితర అంశాలపై చర్చించారు. తగిన సహకారం అందించాలని కలెక్టర్ కోరారు. ఫౌండేషన్ ప్రతినిధి దివ్య, తహసీల్దార్ సంధ్యారాణి, ఎంపీడీఓ బయ్యారపు అశోక్, క్లస్టర్ డైరెక్టర్ బొర్రా సురేష్, గ్రామస్తులు రాము, తేజావత్ బాబు, రామకృష్ణ, రమేష్ పాల్గొన్నారు.
చివరిగింజ వరకూ ధాన్యం కొనుగోళ్లు
సూపర్‌బజార్(కొత్తగూడెం): ఎలాంటి అవాంతరాలు లేకుండా ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ నిర్వహిస్తున్నామని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ తెలిపారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావుతో కలిసి ధాన్యం కొనుగోళ్లపై అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా నుంచి హాజరైన కలెక్టర్ జితేష్ మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటివరకు 34,300 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామని, రైతుల ఖాతాల్లో ఎప్పటికప్పుడు నగదు జమ చేస్తున్నామని తెలిపారు. రానున్న పదిరోజుల్లో మిగిలిన ధాన్యం కొనుగోలు ప్రక్రియ పూర్తి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని పేర్కొన్నారు. మిల్లర్లను సమన్వయం చేసుకుంటూ ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా సాగేలా చర్యలు తీసుకున్నట్లు వివరించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్లు డి.వేణుగోపాల్, విద్యాచందన, డీఎస్‌ఓ రుక్మిణి, పౌరసరఫరాల శాఖ డీఎం త్రినాథ్‌బాబు, డీఏఓ బాబూరావు తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ జితేష్ వి.పాటిల్