
ఉప ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేయాలి
పాల్వంచ: పాల్వంచ మండలంలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలకు వస్తున్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పర్యటనను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. శుక్రవారం టీజీ జెన్‌కో గెస్ట్‌హౌస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. శ్రీనివాస కాలనీలో రూ.1.96 కోట్లతో, పాండురంగాపురంలో రూ. 2.63 కోట్లతో 33/11 కేవీ సబ్ స్టేషన్‌లు, సోములగూడెంలో రూ.4 కోట్లతో చేపట్టనున్న హైలెవల్ బ్రిడ్జి నిర్మాణ పనులు, రూ.9.70 కోట్లతో రాజాపురం వద్ద నిర్మించిన బ్రిడ్జిని ప్రారంభిస్తారని పేర్కొన్నారు. త్వరలో కొత్తగూడెం క్రాస్ రోడ్‌లో జూ పార్క్, సుజాతనగర్‌లో జూనియర్ కళాశాల రానున్నాయని తెలిపారు. మున్సిపల్ కమిషనర్ కె.సుజాత, డీఎస్పీ సతీష్ కుమార్, సీఐ సతీష్, సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్‌కె.సాబీర్ పాషా, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు, నాగసీతారాములు, కనగాల అనంతరాములు, నూకల రంగారావు పలువురు నాయకులు పాల్గొన్నారు.