
డెంగీ నివారణకు సహకారం అవసరం
కొత్తగూడెంఅర్బన్: డెంగీ ప్రమాదాన్ని తగ్గించేందుకు అందరి సహకారం అవసరమని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి భాస్కర్‌నాయక్ తెలిపారు. శుక్రవారం జాతీయ డెంగీ దినోత్సవం సందర్భంగా పట్టణంలో ర్యాలీ నిర్వహించగా.. ఆయన మాట్లాడారు. డెంగీ నివారణ, నియంత్రణ గురించి అవగాహన పెంచడానికి ఏటా మే 16న జాతీయ డెంగీ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారని, ఈ ఏడాది ‘చెక్, క్లీన్ అండ్ క్లియర్’అనే థీమ్‌ను పౌరులు పాటించాలని, నీటిని తనిఖీ చేయాలని, దోమ ల లార్వాలను నాశనం చేయాలని, నిల్వ చేసిన నీటిని కవర్ (మూ) చేయాలని తెలిపారు. అనంతరం ప్రోగ్రామ్ ఆఫీసర్ (మలేరియా) డాక్టర్ పి.స్పందన మాట్లాడారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్‌ఓ ఎస్.జయలక్ష్మి, యూపీహెచ్‌సీ నుంచి వైద్య అధికారులు, పారామెడికల్ సిబ్బంది, కుమారస్వామి, జేతు నగేశ్, చేతన్ తదితరులు పాల్గొన్నారు.
చీడపీడల నివారణపై అవగాహన
టేకులపల్లి: రైతులు అధికంగా యూరియా వా డటం వల్ల చీడపీడలు పెరిగి పెట్టుబడి ఖర్చు పెరుగుతుందని కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు డాక్టర్ నవీన్‌కుమార్, శ్రీనివాస్‌రావు, ఇల్లెందు ఏడీఏ లాల్‌చంద్ అన్నారు. శుక్రవా రం బేతంపూడిలో ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు – అన్నదాత అవగాహన’కార్యక్రమంలో భాగంగా వారు రైతులకు అవగాహన కల్పించారు. నేల ఆరోగ్యాన్ని కాపాడేందుకు అవసరం మేరకు రసాయనాలను వాడాలని, పచ్చిరొట్ట పైర్లు వేసుకుని నేలలో కర్బన శాతాన్ని పెంచుకోవాలని తెలిపారు. ఆరు తడి ద్వారా వరి సాగు చేయాలని, కంది, పెసర, మినుము పంటలను సాగు చేయడం వల్ల భూసారం పెరుగుతుందని చెప్పారు. ఉద్యానవన శాఖలో శాశ్వత పందిళ్లు, మల్చింగ్ పేపర్ వేసుకోవడానికి, పామాయిల్‌కు 50 శాతం సబ్సిడీ పొందే అవకాశం ఉందని వివరించారు. కార్యక్రమంలో ఏఓ అన్నపూర్ణ, హెచ్‌ఓ స్రవంతి, ఏఈఓలు ప్రవీణ్, రమేశ్, శ్రావణి, భాగ్యశ్రీ, రైతులు పాల్గొన్నారు.
ఆదనపు షెడ్ల నిర్మాణానికి శంకుస్థాపన
భద్రాచలంటౌన్: భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామి శ్రీగోకులరామంలో గోవులశాలకు అదనంగా మరో రెండు షెడ్లు నిర్మించేందుకు ఈఓ ఎల్.రమాదేవి శుక్రవారం శంకుస్థాపన చేశారు. దేవస్థానానికి చెందిన ఏపీలోని అల్లూరి జిల్లా ఎటపాక మండలం పురుషోత్తపట్నంలో ఉన్న గోశాలకు మరో రెండు షెడ్లను నిర్మించేందుకు ప్రవాస భారతీయులు సూదిరెడ్డి రామకృష్ణారెడ్డి – శాంత, సత్యనారాయణ రెడ్డి – విజయ దంపతులు విరాళం అందజేయగా.. దాతల కుటుంబ సభ్యులతో కలిసి ఈఓ రమాదేవి భూమి పూజ చేశారు.
కొబ్బరి చెట్లపై పిడుగులు
చింతకాని/కామేపల్లి: చింతకాని మండలంలోని జగన్నాధపురంలోని ఆలస్యం వెంకయ్య ఇంట్లో ఉన్న కొబ్బరి చెట్టుపై శుక్రవారం తెల్లవారుజామున పిడుగు పడింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తున్న సమయంలో పిడుగు పడడంతో చెట్టుపై 20 నిమిషాల పాటు మంటలు చెలరేగాయని స్థానికులు తెలిపారు. ఈ ఘటనతో వెంకయ్య ఇంట్లో అద్దెకు ఉంటున్న కోలేటి రాంచందర్‌రావు గృహంలోని ఎలక్ట్రానిక్స్ సామగ్రి, వైరింగ్ పూర్తిగా కాలిపోయింది. అలాగే, కామేపల్లి మండలం తాళ్లగూడెంలోని బండారి రామయ్య ఇంటి ఆవరణలోని కొబ్బరి చెట్టుపైనా పిడుగు పడింది. అయితే, అంతసేపు రామయ్య ఆరు బయటే నిద్రించగా, వర్షం వస్తుండడంతో లోపలకు వెళ్లాడు. అదే సమయాన పిడుగు పడడంతో ప్రమాదం తప్పినట్లయింది.

డెంగీ నివారణకు సహకారం అవసరం

డెంగీ నివారణకు సహకారం అవసరం

డెంగీ నివారణకు సహకారం అవసరం