
లాజిస్టిక్స్ నిర్వహణపై శిక్షణ
కొత్తగూడెంఅర్బన్: జిల్లా వైద్యా, ఆరోగ్య శాఖ కార్యాలయంలో కుటుంబ నియంత్రణ లాజిస్టిక్స్ నిర్వహణ, సమాచార వ్యవస్థపై గురువారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. 12 ముఖ్యమైన కుటుంబ నియంత్రణ వస్తువులను సమర్థవంతంగా నిర్వహించే అంశంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌ఓ డాక్టర్ భాస్కర్ మాట్లాడుతూ ఎఫ్‌పీ, ఎల్‌ఎంఐఎస్ ప్రాముఖ్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో డీసీహెచ్‌ఎస్ డాక్టర్ రవిబాబు, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ జయలక్ష్మి, డాక్టర్లు చైతన్య, సుకృత, మధువరన్, తేజశ్రీ, ఫైజాయాజుద్దీన్, ఫార్మసిస్టులు తదితరులు పాల్గొన్నారు.
మర్రిగూడెం హెచ్‌ఎంపై విచారణ
ఇల్లెందురూరల్: మండలంలోని మర్రిగూడెం ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రమేష్‌పై డీఈఓ వెంకటేశ్వరాచారి విచారణకు ఆదేశించారు. విచారణ అధికారిగా టేకులపల్లి ఎంఈవో జగన్‌కు బాధ్యతలు అప్పగించారు. మర్రిగూడెం పాఠశాలలో ఆరేళ్లుగా విధులు నిర్వహిస్తున్న ప్రధానోపాధాయుడు రమేష్ విధులకు సక్రమంగా హాజరుకాలేదని, పాఠశాలకు మంజూరైన నిధులను దుర్వినియోగం చేశారని ఆదివాసీ సంక్షేమ పరిషత్ నేతలు, స్థానికులు డీఈఓకు ఫిర్యాదు చేశారు. దీంతో డీఈఓ ఆదేశాలతో టేకులపల్లి ఎంఈఓ గురువారం విచారణ ప్రారంభించారు.
మహిళా సమాఖ్య
నూతన పాలకవర్గం ఎన్నిక
చుంచుపల్లి: మహిళా సమాఖ్య జిల్లా నూతన పాలకవర్గాన్ని గురువారం కొత్తగూడెంలో ఎన్నుకున్నారు. ప్రస్తుత జిల్లా అధ్యక్షురాలు ఎస్.ఉషారాణి, కార్యదర్శి వి.నాగమణి, కోశాధికారి వి.మమత ఉద్యోగ విరమణ పొందారు. వారి స్థానంలో అధ్యక్షురాలిగా ఎస్.సుజాత, కార్యదర్శిగా కె.సునీత, కోశాధికారిగా కె.సౌజన్య ఎన్నికయ్యారు. ఈ సమావేశంలో డీఆర్‌డీఓ విద్యాచందన మాట్లాడుతూ బ్యాంక్ లింకేజ్‌లో జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిపారని అభినందించారు. అదనపు డీఆర్‌డీఓ, డీపీఎంలు, మండల సమాఖ్య అధ్యక్షులు పాల్గొన్నారు.
పది జిల్లాల
మత్స్యకారులకు శిక్షణ
కూసుమంచి: పాలేరులోని పీ.వీ.నర్సింహారావు మత్స్య పరిశోధనా కేంద్రంలో మత్స్యకారులకు మూడు రోజుల పాటే శిక్షణ గురువారం ప్రారంభమైంది. ‘జలాశయాల్లో మత్స్య అభివృద్ధి – యాజమాన్య పద్ధతులు’ అంశంపై ఇస్తున్న ఈ శిక్షణకు ఖమ్మం, నిజామాబాద్, హనుమకొండ, కామారెడ్డి, కుమురంభీం ఆసిఫాబాద్, నాగర్‌కర్నూల్, సూర్యాపేట, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, సిరిసిల్ల జిల్లాల మత్స్యకారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తొలిరోజు మత్స్యశాఖ నేషనల్ ఫెసిలిటేటర్ బి.లవకుమార్ మాట్లాడుతూ శిక్షణను మత్స్యకారులు సద్వినియోగం చేసుకోవాలని, తద్వారా మత్స్య సంపదలో రాష్ట్రాన్ని ముందు నిలపాలని సూచించారు. చేపల పెంపకంలో ఆధునిక పద్ధతులు అవలంబిస్తే మంచి ఫలితాలు వస్తాయని చెప్పారు. పరిశోధనా కేంద్రం పూర్వ, ప్రస్తుత ప్రధాన శాస్త్రవేత్తలు డాక్టర్ జి.విద్యాసాగర్‌రెడ్డి, డాక్టర్ శ్యాంప్రసాద్ మాట్లాడగా మత్స్య శాస్త్రవేత్తలు రవీందర్, గణేష్ పాల్గొన్నారు.
వడదెబ్బతో ఒకరి మృతి
కామేపల్లి: కామేపల్లి ఇరిగేషన్ సబ్‌డివిజన్‌లో లష్కర్‌గా విధులు నిర్వర్తిస్తున్న బండి రాజమ్మ (60) వడదెబ్బతో మృతి చెందింది. ఇటీవల ఆమె అస్వస్థతకు గురి కాగా చికిత్స పొందుతూ తెల్లవారుజామున మృతి చెందిందని కుటుంబీకులు వెల్లడించారు. ఇరిగేషన్ డీఈఈ శంకర్, ఏఈఈ శ్యామ్, ఉద్యోగులు పలువురు ఆమె మృతదేహం వద్ద నివాళులర్పించారు.

లాజిస్టిక్స్ నిర్వహణపై శిక్షణ

లాజిస్టిక్స్ నిర్వహణపై శిక్షణ

లాజిస్టిక్స్ నిర్వహణపై శిక్షణ