
‘సీతారామ’ పరిహారం చెల్లించాలి
దమ్మపేట: సీతారామ ప్రాజెక్ట్ నిర్వాసితులకు పరిహారం చెల్లించాలని కోరుతూ జూలూరుపాడు మండల పరిధిలోని రైతులు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు వినతి పత్రం అందజేశారు. గురువారం మండలంలోని గండుగులపల్లి నివాసంలో మంత్రి తుమ్మలను, సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి దంపతులు మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం జూలూరుపాడు మండలంలో సీతారామ ప్రాజెక్టు కాలువకు భూములు ఇచ్చిన రైతులు మంత్రిని కలిసి తమకు పరిహారం ఇవ్వకుండా తీవ్ర జాప్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో తుమ్మల సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడి పరిహారం సకాలంలో అందజేయాలని సూచించారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు, కాంగ్రెస్ నాయకులు కొయ్యల అచ్యుతరావు, కాసాని నాగప్రసాద్, కే.వి.సత్యనారాయణ, దొడ్డా ప్రసాద్, మన్నెం అప్పారావు పాల్గొన్నారు.
మంత్రి తుమ్మల వద్ద రైతుల ఆవేదన