
వ్యవసాయాధారిత ఉత్పత్తులు తయారు చేయాలి
అశ్వారావుపేటరూరల్: రైతులు వ్యవసాయంపైనే ఆధార పడకుండా, వ్యవసాయ ఆధారిత ఉత్పత్తులను కూడా తయారీ చేసి ఆదాయం పొందాలని శాస్త్రవేత్తలు డాక్టర్ మధుసూధన్‌రెడ్డి, డాక్టర్ పావని, డాక్టర్ కృష్ణతేజ సూచించారు. గురువారం మండలంలోని బచ్చువారిగూడెం గ్రామంలో నిర్వహించిన ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’ కార్యక్రమంలో వారు మాట్లాడారు. రైతులు తమ ధరను తామే నిర్ణయించాలంటే ఒక్క వ్యవసాయంపైనే ఆధారపడితే సరిపోదని, విలువ ఆధారిత ఉత్పత్తులను కూడా తయారీ చేయాలన్నారు. పొలంలో ఉండే ప్రతి కీటకం హాని కలిగించేది కాదని, మిత్ర పురుగులు కుడా ఉంటాయని వివరించారు. అనంతరం ప్రచార పోస్టర్లు, కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఏఓ శివరాం ప్రసాద్, హెచ్‌ఓ వేణుమాధవ్, ఏఈఓలు ఎన్.రవీందర్, సతీష్, షకీరాభాను, కార్యదర్శి మెహరాజ్ ఉద్దీన్, రైతులు పాల్గొన్నారు.