
పుష్కరాలకు నేటి నుంచి ప్రత్యేక బస్సులు
చుంచుపల్లి: సరస్వతి నది పుష్కరాల సందర్భంగా కొత్తగూడెం డిపో నుంచి కాళేశ్వరానికి ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు డీఎం దేవేందర్ గౌడ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. గురువారం నుంచి ప్రతీ రోజు ఉదయం 6 గంటలకు కొత్తగూడెం బస్టాండ్ నుంచి బయలుదేరి.. ఇల్లెందు, మాహబూబాబాద్, నర్సంపేట, ములుగు, భూపాలపల్లి, మహదేవపూర్ మీదుగా మధ్యాహ్నం 12.30 గంటలకు కాళేశ్వరం చేరుకుంటుందని, తిరిగి అదే రోజు సాయంత్రం 4.30 గంటలకు బయలుదేరి అదే మార్గంలో కొత్తగూడెం వస్తుందని వివరించారు. ఈ ఎక్స్‌ప్రెస్ బస్సులో పెద్దలకు చార్జీ రూ. 580, పిల్లలకు రూ.300గా నిర్ణయించామని, ముందుగా రిజర్వేషన్ సౌకర్యం కల్పించామని తెలిపారు. ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వివరాలకు డిపో మేనేజర్ కొత్తగూడెం 99592 25959, బస్టాండ్ ఎంకై ్వరీ 99592 25982, రిజర్వేషన్ కౌంటర్, 99592 25981 నంబర్లలో సంప్రదించాలని తెలిపారు.
నైపుణ్య శిక్షణకు
దరఖాస్తుల ఆహ్వానం
భద్రాచలంటౌన్: భద్రాచలం ఐటీడీఏ పరిధిలోని గిరిజన నిరుద్యోగ యువతకు ఐటీసీ ప్రథమ్ ద్వారా నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇవ్వనున్నట్లు ఐటీడీఏ పీఓ బి.రాహుల్ తెలిపారు. కోర్సుల వారీగా పది రోజుల నుంచి 45 రోజులపాటు శిక్షణ ఉంటుందని, బ్యూటీషియన్, అసిస్టెంట్ ఎలక్ట్రీషియన్, టైలరింగ్ శిక్షణ కోసం పదో తరగతి, ఆపై విద్యార్హత కలిగిన వారు అర్హులని పేర్కొన్నారు. పుట్టగొడుగుల పెంపకం శిక్షణకు ఏడో తరగతి, ఆపైన, జ్యూట్ బ్యాగ్‌ల తయారీకి పదో తరగతి ఉత్తీర్ణులైన వారు అర్హులని వెల్లడించారు. భద్రాచలం, ఖమ్మం వైటీసీల్లో శిక్షణ ఇవ్వడమే కాక ఉచిత భోజన, వసతి సౌకర్యం కల్పిస్తామని పీఓ తెలిపారు. ఆసక్తి ఉన్న వారు విద్యార్హత పత్రాలు, కుల ధ్రువీకరణ జిరాక్స్, ఆధార్, రేషన్ కార్డు/ఉపాధి హామీ బుక్, బ్యాంకు పాస్ బుక్, రెండు ఫొటోలతో ఈనెల 21న ఐటీడీఏలోని వైటీసీలో జరిగే ఇంటర్వ్యూకు హాజరుకావాలని సూచించారు. వివరాలకు 63026 08905, 81438 40906 నంబర్లలో సంప్రదించాలని పీఓ తెలిపారు.
నేటితో ముగియనున్న వేసవి శిబిరం
పాల్వంచరూరల్ : ఆళ్లపల్లిలోని బాలికల క్రీడా పాఠశాలలో ఈనెల 1న ప్రారంభించిన వేసవి క్రీడా శిక్షణ శిబిరం గురువారంతో ముగియనుందని ఐటీడీఏ క్రీడా శాఖాధికారి గోపాల్‌రావు తెలిపారు. ప్రత్యేక కోచ్‌లను నియమించి 72 మంది బాలురు, 72 మంది బాలికలకు వివిధ క్రీడాంశాల్లో శిక్షణ ఇప్పించామని పేర్కొన్నారు. కాగా, ప్రతి సంవత్సరం పాల్వంచ మండలం కిన్నెరసానిలోని క్రీడా పాఠశాలలో నెల రోజుల పాటు ఈ శిబిరాలు నిర్వహించేవారు. అయితే ఈ ఏడాది మాత్రం 15 రోజులకే పరిమితం చేశారు.
ఉపాధ్యాయ శిక్షణను పరిశీలించిన ఆర్‌జేడీ
ఖమ్మం సహకారనగర్: ఖమ్మంలో కొనసాగుతున్న ఉపాధ్యాయుల శిక్షణ శిబిరాన్ని పాఠశాల విద్య రీజినల్ జాయింట్ డైరెక్టర్(ఆర్‌జేడీ) సత్యనారాయణరెడ్డి మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఉపాధ్యాయుల హాజ రు, శిక్షణపై ఆరా తీశారు. అనంతరం ఆర్‌జేడీ మాట్లాడుతూ మార్పులకు అనుగుణంగా శిక్షణ లో నేర్చుకున్న అంశాల ద్వారా బోధించాల్సి ఉంటుందని తెలిపారు. ఖమ్మం డీఈఓ ఎస్.సత్యనారా యణ, ఏఎంఓ రవికుమార్, ప్లానింగ్ కోఆర్డినేటర్ సీహెచ్.రామకృష్ణ, కోర్సు కోఆర్డినేటర్ శైలజలక్ష్మి పాల్గొన్నారు. కాగా, ఖాళీగా ఉన్న గెజిటె డ్ ప్రధానోపాధ్యాయుల పోస్టుల్లో ఎఫ్‌ఏసీ హెచ్‌ఎంలుగా నియమించిన స్కూల్ అసిస్టెంట్లకు ర్యాటిఫికేషన్ ఆర్డర్లు ఇవ్వాలని ఆర్‌జేడీకి పీఆర్‌టీయూ జిల్లా అధ్యక్షుడు యలమద్ది వెంకటేశ్వర్లు వినతిపత్రం ఇచ్చారు. నాయకులు కట్టా శేఖర్‌రావు, పి.వెంకటేశ్వరరెడ్డి, తాళ్లూరి చంద్రశేఖర్, రత్నకుమార్, డి.రవికుమార్, లింగం సతీష్, టి.వెంకన్న, శాంతారెడ్డి, మహేష్, రవికిరణ్, సుబ్బారావు పాల్గొన్నారు.

పుష్కరాలకు నేటి నుంచి ప్రత్యేక బస్సులు