
అర్హత లేని వారితో పనిచేయిస్తే చర్యలు
కొత్తగూడెంఅర్బన్: అర్హత లేని వైద్యులు, పారామెడికల్ సిబ్బందితో పనిచేయిస్తున్న ఆస్పత్రులపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఎంహెచ్‌ఓ భాస్కర్‌నాయక్ హెచ్చరించారు. సోమవారం జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా అంతటా క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్ చట్టాన్ని అమలు చేస్తున్నామని, మినహాయింపు లేకుండా ప్రతి ఆరోగ్య సంరక్షణ కేంద్రంలో అగ్నిమాపక భద్రతా ఆడిట్‌లు నిర్వహిస్తామని తెలిపారు. సమావేశంలో డిప్యూటీ డీఎంహెచ్‌ఓ ఎస్.జయలక్ష్మి, డాక్టర్ ఆర్పీ చైతన్య, డాక్టర్ మధువరుణ్, పుల్లారెడ్డి, తేజశ్రీ, డిప్యూటీ డెమో ఫైజ్మోహియుద్దీన్ పాల్గొన్నారు.
విలువలు కలిగిన
రాజకీయ వేత్త సుందరయ్య
సింగరేణి(కొత్తగూడెం): విలువలు కలిగిన రాజకీయాలకు సుందరయ్య నిలువెత్తు నిదర్శనమని సీపీఎం జిల్లా కార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. సోమవారం మంచికంటిభవన్‌లో పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. సుందరయ్య జీవితం నేటి తరానికి ఆదర్శమని, ఆయన భూస్వామ్య కుటుంబంలో పుట్టి కూడా చిన్ననాటి నుంచి, అంటరానితనం, కులవివక్ష, అసమానతలకు వ్యతిరేకంగా పోరాడారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సుందరయ్య చేసిన త్యాగాలను పలువురు సీపీఎం నాయకులు వివరించారు.
1008 బ్రహ్మసూత్ర
శివలింగాల ప్రతిష్ఠాపన
దుమ్ముగూడెం: మండలంలోని నర్సాపురం గ్రామంలోని శ్రీ ద్వాదశ జ్యోతిర్లింగ చిన్న అరుణాచల ఆలయంలో సోమవారం బ్రహ్మసూత్ర శివలింగాలను ప్రతిష్ఠించారు. ఆలయ వ్యవస్థాపకుడు శివనాగస్వామి ఆధ్వర్యంలో చిన్న అరుణాచలం క్షేత్రంలో వైశాఖ మాసం పంచమితి సోమవారం శ్రవణ నక్షత్రంలో 1008 బ్రహ్మసూత్ర శివలింగాలను 9 అడుగుల బాణలింగాన్ని వేదమంత్రోచ్చరణల మధ్య ప్రతిష్ఠించారు.
ఇద్దరిపై దాడి
ఇల్లెందు: ముగ్గురు యువకులు కలిసి మరో ఇద్దరిపై దాడి చేసిన ఘటన ఆజాద్‌నగర్‌లో సోమవారం చోటుచేసుకుంది. ఆజాద్‌నగర్‌లో జరుగుతున్న ఓ ఫంక్షన్‌కు ఆదివారం రాత్రి అదే ప్రాంతానికి చెందిన ఖాదర్‌పాషా బైక్‌పై వచ్చాడు. అక్కడి ముత్యాలమ్మ గుడి వద్ద బైక్ నిలిపి భోజనం చేసి తిరిగి రాగా.. అదే ఏరియాకు చెందిన ఆర్.వంశీ, మధు, సందీప్ బైక్ ఇవ్వమని కోరారు. తాను వెళ్లాల్సి ఉందని వారించటంతో మాటామాటా పెరిగి ఖాదర్‌పాషాపై చేయి చేసుకున్నారు. ఖాదర్‌పాషా మిత్రుడు ఎస్.వంశీ అడ్డురాగా అతనిపై కూడా దాడి చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్‌ఐ బి.సూర్య తెలిపారు.
పిడుగుపాటుతో
రైతు మృతి
మరో రైతుకు గాయాలు
ఇల్లెందురూరల్: ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తున్న సమయంలో పిడుగు పడడంతో ఓ రైతు మృతి చెందగా, ఆయన సోదరుడైన మరో రైతుకు గాయాలయ్యాయి. ఇల్లెందు మండలం కట్టుగూడెం గ్రామానికి చెందిన సోదరులు పరిటాల పుల్లయ్య (40), వెంకన్న తమ పొలం వద్ద పది రోజులుగా బావి తవ్విస్తున్నారు. మధ్యలో మేడారం వన దేవతల దర్శనానికి వెళ్లిరాగా, సోమవారం పనులు తిరిగి ప్రారంభించారు. పని చేయిస్తుండగా వర్షం మొదలుకావడంతో పుల్లయ్య సమీపంలోని చెట్టు కిందకు వెళ్లి తన సోదరుడు వెంకన్నను కూడా పిలిచాడు. వెంకన్న చెట్టు కిందకు వెళ్తుండగానే పిడుగు పడడంతో పుల్లయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. సమీపానికి చేరిన వెంకన్న షాక్‌తో కింద పడ్డాడు. కాగా, మృతుడికి భార్య లలిత, ఇద్దరు కుమారులు ఉన్నారు.

అర్హత లేని వారితో పనిచేయిస్తే చర్యలు

అర్హత లేని వారితో పనిచేయిస్తే చర్యలు

అర్హత లేని వారితో పనిచేయిస్తే చర్యలు