
స్వర్ణోత్సవాల లోగో ఆవిష్కరణ
సింగరేణి(కొత్తగూడెం) : మందమర్రి ఏరియాలో సింగరేణి పాఠశాల ఏర్పాటై 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కొత్తగూడెం సింగరేణి ప్రధాన కార్యాలయంలో స్వర్ణోత్సవాల లోగోను సీఎండీ ఎన్. బలరామ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మందమర్రిలో 1975లో పాఠశాల ఏర్పాటు చేశామని, ఈజూన్‌తో 50 ఏళ్లు పూర్తవుతుందని తెలిపారు. ఈ పాఠశాలలో సంవత్సరానికి 300 మంది చొప్పున విద్యార్థులు చదువు పూర్తి చేసుకొని బయటకి వెళ్తున్నారని, వారంతా నేడు వివిధ ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థల్లో ఉన్నత హోదాల్లో పనిచేస్తున్నారని వివరించారు. కార్యక్రమంలో సింగరేణి డైరెక్టర్లు ఎల్.వి. సూర్యనారాయణ, వెంకటేశ్వర్లు, ఎడ్యుకేషన్ సొసైటీ కార్యదర్శి గుండా శ్రీనివాస్, సంయుక్త కార్యదర్శి సునీల్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.