విద్యుదాఘాతంతో దుక్కిటెద్దు మృతి | - | Sakshi
Sakshi News home page

విద్యుదాఘాతంతో దుక్కిటెద్దు మృతి

May 15 2025 12:06 AM | Updated on May 15 2025 12:06 AM

విద్య

విద్యుదాఘాతంతో దుక్కిటెద్దు మృతి

దమ్మపేట: విద్యుదాఘాతంతో దుక్కిటెద్దు మృతి చెందిన ఘటన మండల పరిధిలోని అంకంపాలెం గ్రామ శివారులో బుధవారం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం... మండలంలోని అంకంపాలెం గ్రామానికి చెందిన గిరిజన రైతు కొర్సా పుల్లయ్య అనే వ్యక్తికి చెందిన ఎద్దు అదే గ్రామ శివారులో బుధవారం ఉదయం మేతకు వెళ్లింది. ఈ క్రమంలో తక్కువ ఎత్తులోనున్న విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ వద్ద మేత మేస్తుండగా విద్యాదాఘాతానికి గురై మృతి చెందింది. రూ.60 వేలు నష్టపోయినట్లు బాధిత రైతు వాపోయాడు.

ఆటో బోల్తా,

ఎనిమిది మందికి గాయాలు

తల్లాడ: తల్లాడ–సత్తుపల్లి జాతీయ రహదారిపై బుధవారం జరిగిన ప్రమాదంలో ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచకు చెందిన పలువురు ఆటోలో తల్లాడ మండలం మిట్టపల్లిలో బంధువుల ఇంట కర్మకు హాజరై తిరిగి వెళ్తున్నారు. తల్లాడ మండలం అంజనాపురం వద్ద గేదె అడ్డు రావడంతో ఆటో ముందు బైక్‌పై వెళ్తున్న వ్యక్తి ఒక్కసారి బ్రేక్‌ వేయగా కింద పడ్డాడు. ఆ వెంటనే ఆటో డ్రైవర్‌ కూడా సడెన్‌ బ్రేక్‌ వేయగా బోల్తా పడింది. దీంతో ఆటోలో ఉన్న గొర్రెముచ్చు అరుణ, మాలోచి ఆరోగ్యమ్మ, గొర్రెముచ్చు మౌనిక, మణెమ్మ, సిరి, జాన్సీ, గుత్తికొండ జ్ఞాన సుందరికి కాళ్లు, చేతులు, తలకు గాయాలయ్యాయి. అలాగే, బైక్‌పై వెళ్తున్న మట్టగాని గురుపాదం కూడా గాయపడగా క్షతగాత్రులను 108లో ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

ఆరుగురిపై

కేసు నమోదు

జూలూరుపాడు: అక్రమంగా ఇసుక తోలకాలు జరుపుతున్న ఆరుగురు వ్యక్తులపై బుధవారం పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్‌ఐ బాదావత్‌ రవికథనం ప్రకారం.. భేతాళపాడు గ్రామ సమీపంలోని పెద్దవాగులోని ఇసుకను మూడు ట్రాక్టర్లలోలోడు చేస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ట్రాక్టర్‌ యజమానులు ఆంగోత్‌ సక్రు, కోరం నాయయ్య, బల్లెం రంగయ్య, డ్రైవర్లు బానోత్‌ బిక్కు, బానోత్‌ నిఖిల్‌, సోడె వెంకన్నలపై కేసు నమోదు చేశారు.

సైబర్‌ కేసు నమోదు

దుమ్ముగూడెం: మండలంలోని పైడాకులమడుగు గ్రామానికి చెందిన యువతి అకౌంట్‌లోని నగదు మాయం కావడంపై పోలీసులు బుధవారం సైబర్‌ కేసు నమోదు చేశారు. ఎస్‌ఐ గణేష్‌ కథనం ప్రకా రం... పైడాకులమడుగు గ్రామానికి చెందిన గొంది దీవెనకు లక్ష్మీనగరం ఎస్‌బీఐ బ్యాంకులో అకౌంట్‌ ఉంది. ఆ అకౌంట్‌ నుంచి గతేడాది జనవరి 30న రూ.76 వేల నగదును సైబర్‌ నేరస్తులు దొంగిలించారు. బాధితురాలు ఇటీవల బ్యాలెన్స్‌ చెక్‌ చేసుకోగా ఈ విషయం వెలుగుచూసింది. దీంతో సైబర్‌ పోలీసులకు ఫోన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో సైబ ర్‌ పోలీసులు కేసును స్థానిక పోలీస్‌స్టేషన్‌కు బదిలీ చేయగా, దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు.

పశువులు స్వాధీనం

ఇల్లెందురూరల్‌: భారీ కంటైనర్‌ వాహనంలో అక్రమంగా తరలిస్తున్న 18 పశువులను బుధవారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మండల పరిధిలోని సుభాష్‌నగర్‌ గ్రామపంచాయతీ లలితాపురం గ్రామంలో ఏర్పాటు చేసిన చెక్‌పోస్టు వద్ద పోలీసులు వాహనాలు తనిఖీ చేపట్టారు. ఈ క్రమంలో బూర్గంపాడు మండలం మోరంపల్లి బంజర గ్రామం నుంచి పశువులను హైదరాబాద్‌ తరలిస్తుండగా పట్టుకున్నారు. నిందితులు హైదరాబాద్‌కు చెందిన మోహిష్‌ ఖురేషీ, సూర్యపేటకు చెందిన గుగులోత్‌ భానుప్రకాష్‌, బానోత్‌ లాల్‌సింగ్‌లపై కేసు నమోదు చేసినట్లు సీఐ సత్యనారాయణ తెలిపారు. పట్టుబడిన గోవులను పాల్వంచ గోశాలకు తరలించామని పేర్కొన్నారు.

విద్యుదాఘాతంతో  దుక్కిటెద్దు మృతి1
1/2

విద్యుదాఘాతంతో దుక్కిటెద్దు మృతి

విద్యుదాఘాతంతో  దుక్కిటెద్దు మృతి2
2/2

విద్యుదాఘాతంతో దుక్కిటెద్దు మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement